SC Bans BS-IV Vehicles Registration: బీఎస్​-4 వాహనాల రిజిస్ట్రేషన్లపై సుప్రీంకోర్టు వేటు, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ఆటోమొబైల్​ డీలర్ల అసోసియేషన్లకు ఆదేశాలు
Supreme Court | (Photo Credits: PTI)

New Delhi, July 31: దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ కాలంలో అమ్ముడైన బీఎస్​-4 వాహనాల రిజిస్ట్రేషన్లపై సుప్రీంకోర్టు వేటు (SC Bans BS-IV Vehicles Registration) వేసింది. లాక్​డౌన్ ఎత్తివేసిన పదిరోజుల్లో వాహన డీలర్ల వద్ద ఉన్న వాహనాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేయాలన్న గత ఆదేశాలనూ అత్యున్నత న్యాయస్థానం వెనక్కి తీసుకుంది. కరోనా లాక్​డౌన్​ సమయంలోనూ బీఎస్​-4 వాహనాల అమ్మకాలు (BS-IV Vehicles Solds) జరగడంపై సుప్రీంకోర్టుమండిపడింది. ఈ వాహనాల రిజిస్ట్రేషన్లపై తాము చెప్పే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని సుప్రీం (Supreme Court) ఆదేశించింది.

కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసి.. అమ్మకాలు చేశారని ఆటోమొబైల్​ డీలర్ల అసోసియేషన్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మార్చిలోనే ఈ వాహనాల అమ్మకాలపై కోర్టు నిషేధం విధించినా.. ఆ నెల 31 తర్వాత అమ్మకాలు కొనసాగించడాన్ని సుప్రీం తప్పుపట్టింది. చైనాపై ఇండియా డేగ కన్ను, సరిహద్దుల్లో 35 వేల మందితో పహరా, ఇంకా ఫలితం తేలని ఇరుదేశాల మధ్య జరుగుతున్న చర్చలు

వాహన డీలర్ల వద్ద ఉన్న బీఎస్‌-4 వాహనాలకు లాక్‌డౌన్‌ ఎత్తివేసిన పది రోజుల్లోనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేయాలని మార్చి 27న సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా విచారణ చేపట్టిన జస్టిస్​ అరుణ్​ మిశ్రా నేతృత్వంలోని ధర్శాసనం.. తదుపరి ఆదేశాల వరకు బీఎస్​-4 వాహనాలు రిజిస్ట్రేషన్లు చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకుంది. తదుపరి విచారణను ఆగస్టు 13కు వాయిదా వేసింది.

వేరే దేశాలకు బీఎస్​-4 వాహనాలను ఎగుమతి చేసి, అక్కడ అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వాలని డీలర్ల సంఘం కోరికపైనా సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. కొన్ని దేశాలు ఇప్పటికీ బీఎస్​-4 విషయంలో ఎలాంటి పరిమితులు పెట్టలేదని డీలర్లు పేర్కొనగా.. తాము ఎందుకు ఆదేశాలు ఇవ్వాలని కోర్టు ప్రశ్నించింది. అమ్మకాల విషయంలో విధించిన తుది గడువు తయారీదారులకు తెలిసినా ఎందుకు మరింత ఉత్పత్తి చేశారని ప్రశ్నించింది.