New Delhi, November 24: మహారాష్ట్ర(Maharashtra)లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. దీనిపై జస్టిస్ ఎన్వీ రమణ, అశోక్ భూషణ్, సంజీవ్ ఖన్నా( N.V. Ramana, Ashok Bhushan and Sanjiv Khanna)తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఎన్సీపీ, శివసేన తరఫున కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ (Kapil sibal)వాదనలు వినిపించగా.. బీజేపీ తరఫున ముకుల్ రోహత్గీ వాదించారు. ఈ సందర్భంగా మహారాష్ట్రలో శనివారం చోటుచేసుకున్న పరిణామాలను సిబల్ ధర్మాసనానికి వివరించారు.
మెజార్టీ లేని పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఎలా ఆహ్వానిస్తారని, గవర్నర్ నిర్ణయం చట్ట విరుద్ధమని అన్నారు. ఎన్నికల ముందు ఏర్పడిన కూటమి విచ్ఛిన్నం అయ్యిందని, ఆ తరువాత మెజార్టీ గల మూడు పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయని తెలిపారు. ఎమ్మెల్యేల బేరసారాలకు అవకాశం ఇవ్వకుండా శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కూడిన కూటమికి బల నిరూపణకు తక్షణమే అవకాశం ఇవ్వాలని ధర్మాసనానికి విజ‍్క్షప్తి చేశారు. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించేలా గవర్నర్‌కు ఆదేశాలు ఇవ్వాలని ధర్మాసనాన్ని సిబల్ కోరారు.
బీజేపీ తరుఫున ముకుల్ రోహత్గి కోర్టులో వాదనలు వినిపిస్తూ.. మెజార్టీ గల పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయని తెలిపారు. గవర్నర్ (Maharashtra Governor)తనకున్న విచక్షణాధికారం మేరకు నిర్ణయం తీసుకున్నారని, ఆయన నిర్ణయాన్ని ఎలా సవాలు చేస్తారని ప్రశ్నించారు.
గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తెలిపింది. ‘అసెంబ్లీ బలపరీక్షను వెంటనే నిర్వహించాల్సిన అవసరం లేదని, ఎప్పడు చేపట్టాలో సోమవారం తమ నిర్ణయం తెలుపుతామని’ స్పష్టం చేసింది. రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిస్థితులపై వివరణ ఇవ్వాల్సిందిగా.. కేంద్ర ప్రభుత్వానికి, దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్‌లకు నోటీసులు(Supreme Court issued notices) జారీచేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రి(Mr. Fadnavis and Deputy Chief Minister Ajit Pawar)గా ఏర్పడిన ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. జస్టిస్ ఎన్వీ రమణ, అశోక్ భూషన్, సంజీవ్ కన్నాలతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం సెలవు రోజైనా ఆదివారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. కాగా ఆదివారం నాడు వాదనలు వినకూడదని బీజేపీ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి అన్నారు.
దీంతో ఆదివారం విచారణ అనేది ప్రధాన న్యాయమూర్తి విచక్షణాధికారమని జస్టిస్ భూషణ్ తెలిపారు. గవర్నర్ తరఫున ఎవరు వాదిస్తున్నారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీనిపై స్పందించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహ్తా (Solicitor General Tushar Mehta)ఈ విషయం తెలియదని చెప్పారు.
ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ ఎన్సీపీలోని తన వర్గం ఎమ్మెల్యేలతో బీజేపీకి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఫడ్నవిస్‌కు మద్దతు తెలిపిన అజిత్ వర్గం ఎమ్మెల్యేలంతా ఆదివారమే శరద్ పవార్‌తో భేటీ కావడంతో బలపరీక్షలో బీజేపీ నెగ్గడం సవాలుగా మారింది.