Surat Fire: సూరత్‌లో భారీ అగ్ని ప్రమాదం, పదిఅంతస్తుల భవనం మంటల్లో.. , ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువస్తున్న అగ్నిమాపక యంత్రాలు, కొద్దిరోజుల కిందట ఇదే చోట అగ్ని ప్రమాదం
Fire at Surat's Raghuvir Textile Market (Photo Credits: ANI)

Surat, January 21:  గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలోని రఘువీర్ టెక్స్‌టైల్ మార్కెట్‌లో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పదిఅంతస్తుల భవనం మంటల్లో చిక్కుకుంది. వస్త్ర దుకాణాలున్న మార్కెట్ లో మంటలు వ్యాపించడంతో అగ్నిమాపక శాఖ అధికారులు 50 అగ్నిమాపక వాహనాలను రప్పించారు.

ఘటనా స్ధలానికి చేరుకున్న అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. 50కి పైగా అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్ధలానికి చేరాయని అధికారులు తెలిపారు.

కాగా కొద్దిరోజుల కిందట ఇదే భవనంలోని నాలుగో అంతస్తులో అగ్నిప్రమాదం జరగడం గమనార్హం. మరోవైపు అగ్నిప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. పూర్తి వివరాలను కొద్దిసేపటిలో వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.