Tamilnadu Shocker:  17 ఏళ్ల బాలిక తల్లిని చేసిన 12 ఏళ్ల బాలుడు, అత్యాచారం కేసు పెట్టిన బాధితురాలు, బాలుడిని విచారిస్తున్న పోలీసులు, వైద్య పరీక్షలు జరిపే అవకాశం...
Image Used For Representational Purpose Only | (Photo Credits: Newsplate)

తంజావూరు, ఏప్రిల్ 23: పెళ్లి కాకుండా 17 ఏళ్లకే ఓ బిడ్డకు జన్మనిచ్చింది ఆ బాలిక. అందుకు కారణం 12 ఏళ్ల బాలుడి చేతిలో అత్యాచారానికి గురికావడమేనని ఆ బాలిక చెప్తోంది. వినడానికే ఆశ్చర్యంగా ఉన్న ఈ ఘటన తమిళనాడులోని తంజావూరులో ఏప్రిల్ రెండో వారంలో జరగ్గా.. పోలీస్ కేసుతో వెలుగుచూసింది.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. 17 ఏళ్ల బాలిక పెళ్లి కాకుండానే గర్భం దాల్చింది. కొన్ని నెలలుగా పాఠశాలకు కూడా వెళ్లకుండా ఇంట్లోనే ఉంటోంది. పాఠశాలకు ఎందుకు వెళ్లడం లేదని తల్లిదండ్రులు అడగ్గా.. తనకు ఆరోగ్యం బాలేదని చెప్తూ వచ్చింది. ఏప్రిల్ 17న తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్న బాలికను తల్లిదండ్రులు ఆస్పత్రికిి తీసుకెళ్లారు. అక్కడ బాలికను పరీక్షించిన వైద్యులు.. ఆమె నిండు చూలాలుగా గుర్తించారు. అదేరోజు సాయంత్రం బాలిక బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు షాకయ్యారు. అసలు ఏం జరిగిందని బాలికను ప్రశ్నించగా.. ఆమె చెప్పింది విని నిర్ఘాంతపోయారు.

తమ ఇంటి వద్దే ఉంటున్న 12 ఏళ్ల బాలుడు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక తెలిపింది. దాంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆ బాలుడిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. కానీ.. బాలిక చెప్పిన వివరాలపై పోలీసులు సైతం సందేహం వ్యక్తం చేస్తున్నారు.

రాధే శ్యామ్ ఫెయిల్యూర్‌పై స్పందించిన ప్రభాస్, ప్రేమ కథల్లో అభిమానులు నన్ను చూడటానికి ఇష్టపడి ఉండకపోవచ్చని తెలిపిన రెబల్ స్టార్

12 ఏళ్ల బాలుడి కారణంగా గర్భం దాల్చే అవకాశం ఉందా? లేక బాలిక ఏవైనా విషయాలు దాస్తోందా ? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే బాలిక నిండు చూలాలు అయ్యేంతవరకూ తల్లిదండ్రులకు ఈ విషయం తెలియకపోవడంపై కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి కోర్టు తీర్పు మేరకు బాలుడిని బాల నేరస్థుల పాఠశాలకు తరలించారు. కోర్టు నుంచి, సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకుని బాలుడికి వైద్య పరీక్షలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.