దేశంలో థర్డ్‌వేవ్ విస్తృతం అవుతోన్న నేపథ్యంలో స్టాలిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ -19 వ్యాప్తిని అరికట్టడానికి రాష్ట్రంలో జనవరి 6 నుంచి రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ విధించారు. అలాగే ఆదివారం రోజున పూర్తిస్థాయి లాక్‌డౌన్ ఉంటుందని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమలులో ఉంటుంది.
ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం.. అన్ని బస్సులు, రైళ్లు, మెట్రోలు 50శాతం ఆక్యుపెన్సీతో నడుస్తాయి. పొంగల్ సంబంధిత కార్యక్రమాలు/సమావేశాలకు అనుమతి లేదు. బస్సు, సబర్బన్ రైళ్లు మరియు మెట్రోతో సహా ప్రజా రవాణా 50% సీటింగ్‌లో నడుస్తుంది. శుక్ర, శని, ఆదివారాల్లో ప్రార్ధనా స్థలాల్లో భక్తులకు అనుమతి లేదు
ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలు నిర్వహించే పొంగల్ వేడుకలను నిర్వహించకూడదని నిర్ణయం తీసుకున్నారు. శుక్ర, శని, ఆదివారాల్లో ప్రార్థనా స్థలాలు మూసివేయనున్నట్లు తాజా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. కాగా తమిళనాడులో ఒమిక్రాన్ కేసులు 121కి చేరుకున్నాయి.
Here's ANI Pudate
No permission for Pongal related functions/gatherings. Public transport including bus, suburban trains and Metro to run at 50% seating. No permission to devotees in places of worship on Friday, Saturday and Sundays: Tamil Nadu Chief Minister MK Stalin
(file pic) pic.twitter.com/n2aRWE4lOH
— ANI (@ANI) January 5, 2022
మంగళవారం ఒక్కరోజే 2,731 కరోనా కేసులు నమోదయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రెస్టారెంట్లు టేకావే కోసం పనిచేస్తాయి. 1 నుండి 9 తరగతులకు, 10, 12 తరగతులకు భౌతిక తరగతులకు మాత్రమే ఆన్‌లైన్ తరగతులు అనుమతించబడతాయి