Image Used For Representational Purpose Only | (Photo Credits: Newsplate)

Mysore, July 4: తమిళనాడులో దారుణ ఘటన చోటు చేసుకుంది. రాజధాని చెన్నైలోని స్థానిక మొగప్పేర్‌ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయుడిని (Chennai school teacher) పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ పాఠశాలలో శ్రీధర్‌ రామస్వామి సైన్స్‌ టీచర్‌గా పనిచేస్తున్నాడు. కరోనావైరస్ కారణంగా గత రెండేళ్లుగా పాఠశాలలు మూతపడడంతో, ఆన్‌లైన్‌ పాఠాలు నిర్వహించారు. ఆ సమయంలో విద్యార్థుల సెల్‌ఫోన్లు నెంబర్లు ఉపాధ్యాయులు తప్పకుండా పొందాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి.

దీనిని అదనుగా చేసుకొని శ్రీధర్‌ రామస్వామి ఎస్‌ఎంఎస్‌ ద్వారా విద్యార్థులకు అశ్లీల మాటలు (sexually harassing students) పోస్ట్‌ చేసేవాడు. ఉపాధ్యాయుడు కావడంతో విద్యార్థులు ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పేందుకు భయపడ్డారు. మార్కులు ఎక్కువ వేస్తానని, నాతోటి బయటకు రావాలని విద్యార్థినులను ఆయన వేధించేవాడు. ఆయన మాటలు నమ్మిన పలువురు విద్యార్థినులు అతనితో వెళ్లగా, వారిపై అతను లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

మహిళ స్నానం చేస్తుండగా తండ్రి కొడుకులు దారుణం, వీడియో తీసి రూంకి రావాలని బెదిరింపులు, భర్త సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

ఉపాధ్యాయుడి వేధింపులు తట్టుకోలేని కొందరు విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు తెలియజేయడంతో, దిగ్భాంతి చెందిన వారు చైల్డ్‌ లైన్‌ పోలీసులకు సమాచారం అందించారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన పోలీసులు, ఉపాధ్యాయులు బాలికలకు పంపిన వాట్సాప్‌ మెసేజ్‌లు, ఆడియోలు పరిశీలించిన పోలీసులు, అతడిని పోక్సో చట్టం కింద అరెస్ట్‌ చేసి విచారణ చేపట్టారు.