 
                                                                 Chennai, Mar 28: తమిళనాడు రాజధాని చెన్నైలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ స్నేహితులతో కలిసి వెడ్డింగ్ రిసెప్షన్‌లో సరదాగా డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్నేహితులు ఆస్పత్రికి తరలించేలోపే గుండెపోటు( heart attack)తో మృతిచెందాడు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నై(Chennai)లోని కోయంబేడు(Koyambedu) లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో వెడ్డింగ్ రిసెప్షన్(wedding reception) జరుగుతోంది. అందులో సత్యసాయిరెడ్డి(Sathyasai Reddy) 21 ఏళ్ల ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థి( Final ear engineering student) తన స్నేహితురాలి సోదరి వెడ్డింగ్ రిసెప్షన్‌కు వచ్చారు.
రిసెప్షన్ డ్యాన్స్ ఫ్రోగ్రామ్‌లో సత్యసాయితో పాటు అందరూ సరదాగా డ్యాన్స్ చేస్తున్నారు. డ్యాన్స్ చేస్తుండగా సత్యసాయిరెడ్డి నేలకూలిపోయాడు. కిందపడిపోయిన సత్యసాయి చెవి రక్తం రావడంతో అతని స్నేహితులు, అక్కడున్నవారంతా భయాందోళనలకు గురయ్యారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. సత్యసాయి అప్పటికే మృతిచెందాడని డాక్టర్లు చెప్పారు. సత్యసాయి మరణానికి గల కారణాలు మొదట తెలియరాలేదు. అయితే అతను గుండెపోటుతో మృతిచెందాడని తర్వాత తేలింది.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
