NEET (File Image)

Girls Forced to Remove Bra at NEET Exam Center: తమిళనాడు రాజధాని చెన్నైలో ఆదివారం జరిగిన నీట్‌ (NEET) పరీక్ష సందర్భంగా ఒక వివాదం వెలుగుచూసింది. పరీక్ష రాసేందుకు వచ్చిన మహిళలతో బలవంతంగా లోదుస్తులు తొలగించినట్లు ఒక మహిళా జర్నలిస్ట్‌ ఆరోపించింది. నీట్‌ పరీక్షకు హాజరైన మహిళలు బ్రా ధరించ కూడదని చెప్పారని, ధరించి వచ్చిన కొందరితో బలవంతంగా వాటిని విప్పించారని ఆ మహిళా జర్నలిస్ట్‌ ఆరోపించారు.

దీని గురించి చాలా సిగ్గుతో బాధపడిన ఒక యువతితో తాను మాట్లాడటంతో తనకు ఈ విషయం తెలిసిందని ట్విట్టర్‌లో ఆమె పేర్కొన్నారు. అయితే దీనిపై కొందరు ఆ మహిళా జర్నలిస్ట్‌పై అసభ్యకర కామెంట్లతో విరుచుకుపడ్డారు. దీంతో ఆమె ‘నన్ను అసభ్యకరమైన ప్రశ్నలు అడిగే వారు, బ్రా ధరించడానికి అనుమతి ఉందా లేదా? అని పరీక్ష బోర్డుని అడగాలి’ అని వారికి ఘాటుగా సమాధానమిచ్చారు.

యూపీలో ఘోరం, పొలంలో నగ్నంగా శవమై కనిపించిన ఏడేళ్ల బాలిక, ప్రైవేట్ పార్ట్స్‌పై దారుణంగా దాడి చేసి అత్యాచారం

తమిళనాడు విద్యా మంత్రి అన్బిల్ మహేష్ ఈ ఆరోపణపై స్పందించారు. ఇలాంటి వాటిని సీఎం స్టాలిన్‌ తొలి నుంచి ఖండిస్తున్నారని అన్నారు. పరీక్షల సందర్భంగా ఇన్విజిలేటర్ల తీరును ఆయన తప్పుపట్టారు.కాగా, విద్యార్థుల ఉసురు తీస్తున్న నీట్‌ను రద్దు చేయాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ తొలి నుంచి డిమాండ్‌ చేస్తున్నారు. నీట్‌ రద్దు కోసం అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని కూడా ఆమోదించారు.