Chennai, Jan 13: తన తండ్రిపై పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారనే మనస్తాపంతో చెన్నైకి చెందిన ఓ వ్యాపారవేత్త మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక నివేదికల ప్రకారం, తిరువళ్లూరు జిల్లాలోని తిరుత్తణిలో అన్నాడీఎంకే కార్యకర్త నందన్ (70) రాష్ట్ర ప్రభుత్వం పీడీఎస్ దుకాణంలో పంపిణీ చేసిన పొంగల్ గిఫ్ట్ హ్యాంపర్ (govt food packet) అందుకున్నాడు. ఇంటికి వెళ్లి పరిశీలించగా చింతపండులో మృతి చెందిన బల్లి ఉన్నట్లు గుర్తించి చౌక దుకాణం సేల్స్ మ్యాన్‌కు ఫిర్యాదు చేశాడు.
అయితే దీనిపై సేల్స్‌మ్యాన్ శరవణన్ పట్టించుకోకపోవడంతో మీడియాకు తెలిపాడు. దీంతో ఫిర్యాదు చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా తప్పుడు సమాచారం ఇచ్చినట్లు కేసు నమోదు ( father booked for complaining about lizard ) చేశారు. ఈ పరిణామాలతో మనస్తాపం చెందిన అతని కుమారుడు కుప్పుస్వామి (35) మంగళవారం సాయంత్రం కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు.
స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి (Tamil Nadu man kills self) చెందాడు. దీనికి నిరసనగా అన్నాడీఎంకే నేతలు రాస్తారోకో చేపట్టారు. దీనిపై తిరుత్తణిలో నిరసనలు చెలరేగాయి, తమ పార్టీ సభ్యునిపై తప్పుడు కేసు నమోదు చేశారని అన్నాడీఎంకే ప్రభుత్వం.. పోలీసులపై విరుచుకుపడింది.
Here's Edappadi K Palaniswami Tweet
தெரிவித்து கொள்கிறேன்,
வலைத்தளங்களில் பதிவிட்டால் குண்டர் சட்டம்,
உண்மையை கூறினால் ஜாமினில் வெளிவரா வழக்கு என திமுகஆட்சியில் ஜனநாயகத்தை முடக்கும் முயற்சி தொடர்கிறது,
கொடுங்கோல் ஆட்சியில் முறையான கேள்வி கேட்டால், மரணம்தான் பதிலாக கிடைக்கிறது!
இது தற்கொலை அல்ல,ஜனநாயக படுகொலை!
2/2
— Edappadi K Palaniswami (@EPSTamilNadu) January 12, 2022
అన్నా డీఎంకే అధినేత ఎడిప్పాడి పళని స్వామి ట్విట్టర్ లో ఈ ఘనటకు సంబంధించిన ట్విట్ చేశారు. ఇది ఆత్మహత్య కాదు, ప్రజాస్వామ్య హత్య అంటూ మండిపడ్డారు. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.