
Chennai, January 28: కరోనా(Corona) తీవ్రత తగ్గుముఖం పడుతుండటంతో తమిళనాడు ప్రభుత్వం(Tamilnadu Govt.) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి స్కూళ్లు(Schools), కాలేజీల (Colleges)ను పునః ప్రారంభించనున్నట్లు సీఎం స్టాలిన్(CM Stalin) ప్రకటించారు. అంతేకాదు ఇవాళ్టి నుంచి రాత్రి పూట కర్ఫ్యూ (Night Curfew)ను కూడా ఎత్తి వేస్తున్నట్లు తెలిపారు. అయితే, ఎల్‌కేజీ, యూకేజీ, ప్లేస్కూళ్లను తెరిచేందుకు మాత్రం అనుమతి మంజూరు చేయలేదు. వీటిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు.
తమిళనాడు రాష్ట్రంలో కరోనా మరలా ప్రబలుతున్న కారణంగా ప్రభుత్వం గత నెల 7వ తేదీ నుంచి పలు ఆంక్షలను అమలులోకి తెచ్చింది. ఇందులో భాగంగా పాఠశాలల మూత, శుక్ర, శని, ఆదివారాల్లో ప్రార్థనాలయాల్లో దర్శనాల నిలిపివేత, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ, ప్రతి ఆదివారం పూర్తి లాక్‌డౌన్ వంటి నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఈనేపథ్యంలో కరోనాపై సమీక్షించిన ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ నిబంధనలను సడలించారు. హోటళ్లు, అతిథి గృహాలు 50 శాతం వినియోగదారులకు అనుమతిస్తున్నట్లు చెప్పారు.