 
                                                                 Chennai, Dec 13: తమిళనాడు తిరువణ్ణామలై జిల్లాలోని చెంగాం ఏరియాలో దారుణం జరిగింది. గంజాయి మత్తులో ఓ వ్యక్తి కుటుంబంలోని ఐదుగురిని హత్య (Man Kills Five Members Of Family) చేసి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుల్లో ఆయన భార్య, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మరొక కూతురు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది,
ఓరంతాడి గ్రామంలోని పళని అనే రైతు కొద్ది రోజులుగా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. కొద్ది రోజులుగా తన భార్య అనారోగ్యంతో బాధపడుతోంది. ఒక్కసారిగా ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. ఈ క్రమంలో సోమవారం రాత్రి తన భార్యను, బిడ్డలను దారుణంగా గొడ్డలితో నరికి హత్య చేశాడు. మృతుల్లో త్రిష(15), మోనిషా (14), శివశక్తి (6), ధనుష్(4), భూమిక(9 నెలలు)గా గుర్తించారు.
స్థానికులు గమనించి వారిని హుటాహుటిన తిరువణ్ణామలై జిల్లా ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన అనంతరం నిందితుడు పళని తన పొలం వద్దకు వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్యకు (Hangs Self In Chengam area) పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
