![](https://test1.latestly.com/wp-content/uploads/2021/12/Arrested.jpg)
Salem, Dec 23: తమిళనాడులోని సేలం జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ట్రాన్స్‌జెండర్ మహిళగా మారిన ఒక యువకుడిని అతని తల్లి, బంధువులు హత్య చేశారు. 5 ఏళ్ల మహిళ తన లింగమార్పిడి కొడుకును హత్య చేసిన ఆరోపణలపై పోలీసులు అరెస్టు (Woman arrested for killing her son) చేశారు. సూరమంగళం సమీపంలోని జాగీరమ్మపాలెంలో ఈ ఘటన జరిగింది.
దారుణ వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని సేలం నగరానికి చెందిన ఉమాదేవి(45) జులై నెలలో తన కుమారుడు నవీన్ కుమార్(20) (Naveen Kumar) కనబడటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొన్ని రోజుల తరువాత పోలీసులు నవీన్ కుమార్‌ని పట్టుకొని కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టుకు నవీన్ కుమార్ తన సమస్యను చెప్పాడు. తాను ఒక మహిళగా (transperson in Salem) మారిపోయానని.. దీంతో ఇంట్లో తల్లి, బంధువుల గొడవ చేస్తుండడంతో పారిపోయి విడిగా ఉంటున్నానని వివారించాడు. నవీన్ కుమార్ సమస్యను అర్థం చేసుకున్న కోర్టు అతను ఒక మహిళగా జీవించేందుకు అధికారం ఉందంటూ తీర్పునిచ్చింది.
కానీ చాలా కాలం తరువాత డిసెండర్ 13న తల్లిని చూడడానికి ఇంటికి వచ్చిన నవీన్ కుమార్‌ని అతని తల్లి, బంధువులు చితకబాదారు. కుటుంబ పరువు నాశనం చేస్తున్నాడని నవీన్ బంధువులు అతడికి బలవంతంగా హార్మోన్ ఇంజెక్షన్ వేయాలని కూడా ప్రయత్నించారు. నవీన్ లింగ మార్పిడి మారకుండా నిరోధించడానికి కొన్ని హార్మోన్లు బలవంతంగా ఇంజెక్ట్ చేయాలని ఉమాదేవికి సూచించారు. ఈ క్రమంలో నవీన్ అందుకు ప్రతిఘటించేసరికి తల్లి ఉమాదేవి అతడిని బలంగా కొట్టింది. దీంతో నవీన్ కుప్పకూలిపోయాడు.
నవీన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 14న మృతిచెందాడు. పోలీసులు నవీన్ మరణించక ముందు అతడి వాంగ్మూలం తీసుకొని ఉమాదేవి, ఆమె బంధువులపై హత్య కేసు నమోదు చేశారు. ఈ కేసులో అనుమానాస్పద మృతిపై క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్‌పీసీ) సెక్షన్ 174 కింద కేసు నమోదు చేశారు. అనంతరం నవీన్ తల్లిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.