Tata Nexon iCNG (Photo-Tata Motors)

ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం టాటా మోటార్స్‌ (Tata motors) తన నెక్సాన్‌ లైనప్‌లో సీఎన్‌జీ వేరియంట్‌ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ నెక్సాన్‌ ఐసీఎన్‌జీ  (Nexon iCNG) ఎస్‌యూవీ ధర రూ.8.99 లక్షల (ఎక్స్‌- షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుందని కంపెనీ తెలిపింది.  నెక్సాన్‌లో పెట్రోల్‌, డీజిల్‌, ఈవీ వేరియంట్లు ఉండగా కొత్తగా అత్యాధునిక ఫీచర్లతో సీఎన్‌జీ వేరియంట్‌ను జోడించినట్లు టాటా మోటార్స్‌ తెలిపింది.

1.2 లీటర్ల టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌తో నెక్సాన్‌ ఐసీఎన్‌జీ తీసుకొచ్చింది. ఇది 98 bhp, 170 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డ్యూయల్‌ సిలిండర్‌ సదుపాయంతో ఈ ఐసీఎన్‌జీని లాంచ్‌ చేశారు. రెండు స్లిమ్‌ సిలిండర్లు ఉండడంతో కార్గో ఏరియా విశాలంగా ఉంటుందని కంపెనీ విడుదల సందర్భంగా తెలిపింది. 6 ఎయిర్‌ బ్యాగ్‌లు భద్రతా ఫీచర్లను జోడించినట్లు కంపెనీ చెబుతోంది.

Audi Q8 Facelift: ఆడి నుంచి భారత మార్కెట్లోకి క్యూ8 ఫేస్‌లిఫ్ట్ కారు, ధర రూ.1.17 కోట్లు పై మాటే, కేవలం 5.6 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగం దీని సొంతం 

పనోరమిక్‌ సన్‌రూఫ్‌, 10.25 అంగుళాల డిజిటల్‌ డ్రైవర్‌ డిస్‌ప్లే, 360 డిగ్రీల కెమెరా, లెథర్‌ సీట్లు, నావిగేషన్‌ డిస్‌ప్లే ఇందులో ఉంటుంది. స్మార్ట్‌ (O), స్మార్ట్‌ +, స్మార్ట్‌ + ఎస్‌, ప్యూర్‌, ప్యూర్‌ ఎస్‌, క్రియేటివ్‌, క్రియేటివ్‌ +, ఫియర్‌లెస్‌ + పీఎస్‌.. మొత్తం ఎనిమిది వేరియంట్లతో సౌకర్యవంతమైన ఫీచర్లతో టాటా నెక్సాన్‌ ఐసీఎన్‌జీ వచ్చింది. వీటిలో టాప్‌ వేరియంట్‌ అయిన ఫియర్‌లెస్‌ + పీఎన్‌ ధర రూ.14.50 (ఎక్స్‌- షోరూమ్‌) లక్షలుగా ఉంది.