ఎయిరిండియాను రూ.18 వేల కోట్ల బిడ్‌తో టాటా సన్స్ టేకోవర్ (TATA-Air India) చేసుకుంటున్న సంగతి విదితమే. ఏవియేషన్ రంగంలో పూర్తిస్థాయిలో అడుగిడేందుకు టాటా సన్స్ ఖర్చు చేస్తున్న ఖర్చు అక్షరాల రూ.18వేల కోట్లు (Rs 18,000 Crores). ఇప్పటికే డిజిటల్, హైటెక్ మాన్యుఫాక్చరింగ్, హెల్త్‌కేర్ రంగాల్లోకి అడుగిడిన టాటా సన్స్ ఏవియేషన్‌లో కూడా విజయం సాధించే దిశగా అడుగులు వేస్తోంది. 14 ఏండ్లుగా ఎయిరిండియా (Tata Sons Wins Bid for Air India) నష్టాలే చవి చూస్తున్న నేపథ్యంలో పుట్టింటికి చేరుకుంటున్న మహారాజాతో టాటా సన్స్‌కు సానుకూలం అంత ఈజీ కాదని తెలుస్తోంది.
కరోనాకు ముందు పరిస్థితుల్లోకి రావాలంటే మరో నాలుగేండ్లు వేచి చూడాల్సి రావచ్చు.. అంటే మరో నాలుగేండ్లకు విదేశీ ప్రయాణికుల ట్రాఫిక్.. కరోనా ముందు నాటి పరిస్థితులకు చేరుతుందని అంచనా . అప్పటి వరకు ఎయిరిండియాలో లాభాలు చూడటం కష్టమేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఎయిర్ ఏషియా ఇండియా, విస్తారా సంస్థల్లో టాటా సన్స్‌ను రూ.6,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టింది.
కానీ ఇప్పటి వరకు వాటి వల్ల నష్టాలు రూ.9000 కోట్ల పై చిలుకే అని తెలుస్తోంది. అధిక ఆపరేషన్స్ వ్యయం, ఎయిర్ ఏషియా ఇండియాలో ముడుపుల కుంభకోణాలు వెలుగు చూశాయి. అయితే, పూర్తిగా ఎయిరిండియాను పునర్వ్యస్థీకరించాల్సిందేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. భూషణ్ స్టీల్ తర్వాత చంద్రశేఖరన్ హయాంలో టాటా సన్స్ టేకోవర్ చేస్తున్న రెండో సంస్థ ఎయిరిండియానే.
కేంద్రం నుంచి ఎయిరిండియా అప్పగింత పూర్తయ్యాక సంస్థ ఐటీ, డిజిటల్ ఆపరేషన్స్‌ను టీసీఎస్ పూర్తిగా పర్యవేక్షించనున్నది. ఇప్పటికే సింగపూర్ ఎయిర్‌లైన్స్-టాటా సన్స్ జాయింట్ వెంచర్‌విస్తారాకు టీసీఎస్ టెక్నాలజీ పార్టనర్.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద విమానయాన సంస్థ సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఐటీ, డిజిటల్ సిస్టమ్స్ పర్యవేక్షణ బాధ్యత కూడా టీసీఎస్‌దే. JRD టాటా 1932 లో టాటా ఎయిర్‌లైన్స్‌ను స్థాపించారు. ఇది 1946 లో ఎయిర్ ఇండియా లిమిటెడ్‌గా మార్చబడింది. దీనిని 1953 లో ప్రభుత్వం జాతీయం చేసింది.