Job Cut. (Photo Credits: Pixabay)

Mumbai, Dec 13: అగ్రరాజ్యం అమెరికాలో ఐటీ ఉద్యోగులకు డేంజర్ బెల్స్ (Tech Layoffs) మొదలయ్యాయి. అమెరికాలో భారీ ఎత్తున ఉద్యోగులను కంపెనీలు తొలగించే పనిలో పడ్డాయి. టెక్ లేఆప్స్ ట్రాకింగ్ సైట్ ట్రూఅప్‌ ప్రకారం.. 2022 సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టెక్ కంపెనీలు 1434 సార్లు (1,434 layoffs) ఉద్యోగుల తొలగింపులు ప్రకటించాయని పేర్కొంది. ఈ ఏడాది జనవరి 1 నుంచి డిసెంబర్‌ 12 వరకు దాదాపు 2,18,324 మంది ఉద్యో­గులను ( 221,151 people impacted ) టెక్‌ కంపెనీలు తొలగించాయని ఆ నివేదికలో పేర్కొంది. ట్రూఅప్ (TrueUp) అనేది టెక్ ప్రపంచంలో నివేదికలను అందించే ఓ వెబ్‌సైట్.

భారతీయ ఉద్యోగులకు అమెజాన్ భారీ షాక్, నవంబర్ 30 లోపు కంపెనీని వదిలేయాలని ఆదేశాలు, కంపెనీ అందించే బెనిఫిట్స్ తీసుకుని రిజైన్ చేయాలని సూచన

ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక మాంద్యంతో పాటుగా ఉద్యోగులు సరైన ప్రతిభ కనపర్చకపోవడంతో కంపెనీలు తొలగింపు బాటను ఎన్నకున్నాయి. ఇదిలా ఉంటే మన దేశంలో టెక్‌ కంపెనీల్లో పెద్దగా ఉద్యోగుల తొలగింపు లేదని తెలుస్తోంది. భారత్ లో ప్రస్తుతం ఉన్న ఉద్యోగులను కాపాడుకోవడానికే టెక్‌ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగానే యాక్సెంచర్‌ కంపెనీ ఇటీవల 60 వేల మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించింది. ఇండియాలో విచ్‌ (డబ్ల్యూఐటీసీహెచ్‌) (విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్‌) కంపెనీలు 2022లో లక్ష మందికిపైగా ఉద్యోగులను నియమించుకున్నాయి.

గూగుల్ ఉద్యోగులకు భారీ షాక్, 10 వేల మంది ఉద్యోగులను తొలగించే యోచనలో కంపెనీ, పేలవమైన పనితీరు ప్రదర్శించే వారిని బయటకు పంపే ప్రయత్నం

అమెరికాలో ప్రధానంగా ఫేస్‌బుక్, యాపిల్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, గూగుల్‌, ట్విట్టర్‌ కంపెనీలు ఉద్యోగులను తొలగించే పనిలో పడ్డాయి. ట్విట్టర్ కంపెనీ అయితే ఏకంగా 50 శాతం ఉద్యోగులకు ఇంటికి పంపించింది. ఇక బైజూస్ ఒక్క అక్టోబర్‌లోనే 2,500 మంది ఉద్యోగులను తొలగించింది. అయితే ఈ ఏడాది మరి కొద్ది రోజుల్లో ముగుస్తున్న నేపథ్యంలో భారత్ లో కూడా వచ్చే ఏడాది టెక్ కంపెనీలు భారీగా తొలగింపులు చేపట్టే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అది జరగకపోతే టెక్ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు.

భారత్‌లో లేఆఫ్‌లను ట్రాక్‌ చేస్తున్న ఐఎన్‌సీ42 వెబ్‌సైట్‌ కూడా తన నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో దేశంలో ఎడ్యుకేషన్‌ టెక్నాలజీ, టెక్‌ రంగాలకు చెందిన 52 స్టార్టప్‌ కంపెనీలు 2022లో 17,604 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిపింది. బైజూస్, ఛార్జ్‌బీ, కార్స్‌24, లీడ్, ఓలా, మీషో, ఎంపీఎల్, ఇన్నోవేక్సర్, ఉడాన్, అన్‌అకాడమీ, వేదాంతు వంటి కంపెనీలు ఇందులో ఉన్నాయి. అలాగే ఏడు ఎడ్యుకేషన్ టెక్‌ యూనికార్న్‌ కంపెనీల్లోని నాలుగింటిలో 7,483 మంది ఉద్యోగులను తొలగించగా.. 15 స్టార్టప్‌ ఎడ్‌టెక్‌ కంపెనీల్లో ఐదు కంపెనీలు ఈ ఏడాది మూతపడ్డాయి.