American Flag (Photo Credits: Twitter)

Dallas, June 27: అమెరికాలో తెలుగువాళ్ల (Telugu People) డామినేష‌న్ రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఉద్యోగ వ్యాపారాల కోసమే ఇలా అనేక రకాలుగా ఎన్నో రంగాలని ఎంచుకుని జీవనం సాగిస్తూ ఉంటారు తెలుగువారు (Telugu speakers).ఈ క్రమంలోనే ఎంతో మంది తెలుగు వాళ్ళు అమెరికాలో (Us Settled) సెటిల్ అయిపోయారు.అయితే గ‌డిచిన ఎనిమిదేళ్ల‌లో అమెరికాలో తెలుగువాళ్ల సంఖ్య భారీగా పెరిగింది. 2016లో 3.2 లక్ష‌ల మంది తెలుగు మాట్లాడేవాళ్లు ఉండ‌గా..2024 నాటికి ఏకంగా అది 12.3 ల‌క్ష‌ల‌కు చేరింది. అంటే ఎనిమిదేళ్ల‌లో దాదాపు 9 ల‌క్ష‌ల మంది తెలుగుమాట్లాడేవాళ్లు పెరిగారు.

Abraham Lincoln Wax Statue Melt: ఎండ వేడికి కరిగిపోయిన అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ మైనపు విగ్రహం, ఫోటో ఇదిగో.. 

కాలిఫోర్నియాలో అత్య‌ధికంగా 2 ల‌క్ష‌ల మంది తెలుగు మాట్లాడేవాళ్లు ఉండ‌గా, టెక్సాస్ లో 1.5 లక్ష‌ల మంది ఉన్నారు. న్యూజెర్సీలో 1.1 ల‌క్ష‌లు, ఇల్సినాయిస్ లో 83వేలు, వ‌ర్జీనియాలో 78వేలు, జార్జియాలలో 52వేల మంది తెలుగువాళ్లు ఉన్నారు.

 

ప్ర‌తి సంవ‌త్స‌రం 60 నుంచి 70వేల మంది తెలుగు విద్యార్ధులు అమెరికాకు వ‌స్తున్న‌ట్లు అక్క‌డి అసోసియేష‌న్లు చెప్తున్నాయి. అందులో 10వేల మంది హెచ్ 1బీ వీసాదారులు ఉన్నారు. ఇక డ‌ల్లాస్, బే ఏరియా, నార్త్ క‌రోలినా, న్యూజెర్సీ, అట్లాంటా, ఫ్లోరిడా వంటి ప్రాంతాల్లో ఎక్కువ‌గా తెలుగువాళ్లు సెటిల్ అయ్యేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు.