ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల సంస్కరణలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓటరు ఐడీని ఆధార్‌తో అనుసంధానం చేసే బిల్లును (Election Laws (Amendment) Bill 2021) పార్లమెంట్ ముందుకు తీసుకువచ్చింది. గత వారం కేంద్ర కేబినెట్‌లో ఈ బిల్లును ఆమోదించిన కేంద్రం.. సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది.
ఎట్టకేలకు లోక్ సభలో కూడా ఈ బిల్లు ఆమోదం పొందింది. ఎన్నికల చట్ట (సవరణ) 2021 (Election Laws Amendment Bill) పేరుతో బిల్లును కేంద్రం తెచ్చింది. ఈ బిల్లు ప్రకారం.. ఓటరు జాబితాలో పేర్లను నమోదు చేసుకోవాలి అనుకునేవారి గుర్తింపు పత్రంగా ఆధార్ నెంబర్‌ను అడిగే హక్కు ఎన్నికల నమోదు అధికార్లకు ఉంటుంది. ఈ చట్టంలో మార్పుల బిల్లును లోక్ సభలో (Lok Sabha) కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టారు. బిల్లు ఆమోదం అనంతరం లోక్ సభ రేపటికి వాయిదా పడింది.
ఓటర్ల జాబితాలో ఒకటి కంటే ఎక్కువసార్లు నమోదైన ఎంట్రీల్ని తొలగించేందుకు వీలుగా వాటిని ఆధార్ తో లింక్ చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. తద్వారా ఎన్నికల విధానం పారదర్శకమవుతుందని తెలిపింది. ఇప్పటికే ఓటర్ల జాబితాలో చేర్చబడిన వ్యక్తుల నుంచి నంబర్‌ను అడగడానికి మరియు ఒకటి కంటే ఎక్కువ మంది ఓటర్ల జాబితాలో ఒకే వ్యక్తి పేరు నమోదును గుర్తించడానికి అధికారులను అనుమతించాలని కూడా ఈ బిల్లు కోరే అవకాశం ఉంది.
Here's ANI Tweet
'The Election Laws (Amendment) Bill, 2021' passed in Lok Sabha.
The Bill seeks to allow electoral registration officers to seek the Aadhaar number of people who want to register as voters "for the purpose of establishing the identity".
House adjourned till tomorrow, 21st Dec. pic.twitter.com/QjGDjGhl4j
— ANI (@ANI) December 20, 2021
ప్రతిపకక్షాలు ఈ బిల్లను వ్యతిరేకంచాయి. ఇది గోప్యతా హక్కును ఉల్లంఘిస్తుందని, బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపాలని కోరారు. డేటా భద్రత బిల్లు లేకుండా ప్రభుత్వం ఈ బిల్లును తదీసుకురావడం చట్ట ఉల్లంఘన అని పేర్కొన్నాయి. కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఈ బిల్లును వ్యతిరేకించారు. ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టే విషయంలో ఓవైసీ డివిజన్ ఓటు కోరినా స్పీకర్ అనుమతించలేదు. ఆధార్ చట్టం ఆధార్, ఓటర్ ఐడీ లింక్‌ను అనుమతించదని, సంక్షేమ పథకాల కోసం మాత్రమే ఆధార్‌ను ఉపయోగించవచ్చని మనీష్ తివారీ పేర్కొన్నారు.
టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్, కూడా ఈ బిల్లును ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందని పేర్కొన్నారు. బిల్లును వ్యతిరేకించిన బీఎస్పీ ఎంపీ రితేష్.. ఇది పుట్టుస్వామి తీర్పును ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. ఆర్ఎస్పీ ఎంపీ ప్రేమచంద్రన్, కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్, ఆధార్ నివాస రుజువు మాత్రమేనని పౌరసత్వ గుర్తింపుకు ఆధారం కాదని గుర్తుచేశారు. ప్రతిపక్షాల వ్యతిరేకత మధ్య ఈ బిల్లును లోక్ సభలో కేంద్రం ఆమోదం పొందింది.