Maharishi Valmiki International Airport

New Delhi, Dec 28: డిసెంబర్ 30న ప్రారంభించనున్న అయోధ్యలోని (Ayodhya) విమానాశ్రయానికి ‘మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అయోధ్యధామ్’గా (Maharishi Valmiki International Airport Ayodhya Dham) నామకరణం చేశారు. ఈ విమానాశ్రయానికి రామాయణ పురాణ రచయితగా ప్రసిద్ధి చెందిన పురాణ కవి వాల్మీకి పేరు పెట్టారు. ఈ విమానాశ్రయాన్ని (Maharishi Valmiki International Airport) గతంలో ‘మర్యాద పురుషోత్తం శ్రీ రామ్ అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయం’ అని పిలిచేవారు. అంతకంటే ముందు రోజు డిసెంబర్ 27న అయోధ్య రైల్వే స్టేషన్ పేరును అయోధ్య ధామ్ జంక్షన్‌గా మార్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అయోధ్య 3D లైట్ షో వీడియో ఇదిగో, సరయూ నది ఒడ్డున రామాయణాన్ని కళ్లకు కట్టినట్లు చూపుతున్న 3డి లైట్ అండ్ సౌండ్ షో

విమానాశ్రయం మొదటి దశ నిర్మాణానికి దాదాపు రూ.1,450 కోట్లు ఖర్చుతో అభివృద్ధి చేశారు. కొత్త టెర్మినల్ భవనం, 6,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో, 600 మంది పీక్-అవర్ ప్రయాణీకులకు వసతి కల్పించడానికి రూపొందించబడింది. వార్షిక నిర్వహణ సామర్థ్యం 10 లక్షల మంది ప్రయాణికులు. రెండవ దశ అభివృద్ధిలో 50,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కొత్త టెర్మినల్ భవనం నిర్మించబడుతుందని, రద్దీ సమయాల్లో 3,000 మంది ప్రయాణికులు మరియు ఏటా 60 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించగల సామర్థ్యం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.

అయోధ్య రైల్వే స్టేషన్‌ పేరును అయోధ్య ధామ్ జంక్షన్‌‌గా మార్చిన రైల్వే శాఖ, రామ మందిర ప్రారంభోత్సవానికి ముందు కీలక నిర్ణయం

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నగరంలో నూతనంగా నిర్మించిన రామాలయానికి 2024 జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు. అందుకోసం ఏర్పాట్లన్నీ ముమ్మరంగా సాగుతున్నాయి. దానికి ముందు ప్రధాని నరేంద్రమోదీ నగరంలో పునరుద్ధించిన అయోధ్య ధామ్ రైల్వే జంక్షన్‌ను, కొత్తగా నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. డిసెంబర్‌ 30న ఈ ప్రారంభోత్సవాలు జరుగనున్నాయి.ఈ నేపథ్యంలో ఇప్పటికే ‘అయోధ్య రైల్వే జంక్షన్‌’గా ఉన్న అయోధ్య రైల్వే స్టేషన్‌ పేరును ‘అయోధ్య ధామ్‌ జంక్షన్‌’గా మార్చారు.