Young Rebel star Prabhas Donates Rs.5 Crore to Telugu states

టాలీవుడ్ అగ్రహీరో ప్రభాస్ వర్ధమాన సినీ రచయితల కోసం ఓ వినూత్న వేదికను ఆవిష్కరించారు.దీనిపేరు పేరు 'ది స్క్రిప్ట్ క్రాఫ్ట్'. ఈ వేదికపై కొత్త రచయితలు తమ ఆలోచనలను (కథలను) విస్తృతస్థాయిలో ప్రేక్షకులతో పంచుకోవచ్చు. తమ క్రియేటివిటీని ప్రదర్శించడం ద్వారా, ఔత్సాహిక రచయితలు ఎక్కువ మంది దృష్టిలో పడడానికి ఈ వేదిక సహాయపడుతుంది.

'ది స్క్రిప్ట్ క్రాఫ్ట్' కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే... రచయితలు తమ కథలను ఆడియన్స్ ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆడియన్స్ ఈ మినీ కథలను చదివి తమ ఫీడ్ బ్యాక్ తెలియజేసి, రేటింగ్ ఇస్తారు. ఇలా అత్యధిక రేటింగ్ వచ్చిన కథలకు, ఆ కథలు రాసిన రచయితలకు టాలీవుడ్ లో అసిస్టెంట్ రైటర్లుగా, అసిస్టెంట్ డైరెక్టర్లుగా అవకాశం కల్పిస్తారు. ఇందుకోసం 'ఇమేజిన్ యువర్ ఫేవరెట్ హీరో విత్ సూపర్ పవర్స్' పేరుతో ఓ పోటీ నిర్వహిస్తున్నారు.

అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్, ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారన్న పిటిషన్‌ను క్వాష్ చేస్తూ హైకోర్టు తీర్పు, వ్యక్తిగత పర్యటన కోడ్ ఉల్లంఘన కిందకు రాదన్న న్యాయస్థానం

రచయితలు చేయాల్సిందల్లా... ప్రకటనలో పేర్కొన్న విధంగా 3,500 పదాలతో కథను రాసి 'ది స్క్రిప్ట్ క్రాఫ్ట్' కు పంపించాలి. ఈ కథల్లో ఆడియన్స్ మెచ్చిన వాటికి టాప్ రేటింగ్ లభిస్తారు. ఆ టాప్ స్టోరీస్ రాసిన రైటర్లకు తగిన అవకాశాలు కల్పించే బాధ్యతను 'ది స్క్రిప్ట్ క్రాఫ్ట్' తీసుకుంటుంది.