Chennai, May 8: తమిళనాడులో ఓ కసాయి తండ్రి స్నేహితులతో కలిసి కన్నకూతురిపై లైంగిక దాడి (sexually assault) చేశాడు. 2019లో జరిగిన ఈ దారుణ ఘటనలో నేరం రుజువవటంతో ప్రధాన నిందితుడైన తండ్రికి 60 ఏళ్లు, అతని ఇద్దరు స్నేహితులకు 40 ఏళ్లు చొప్పన న్యాయస్ధానం జైలు శిక్ష విధించింది. ఈరోడ్ జిల్లా గోబి సమీప గ్రామానికి చెందిన బాలిక(10) తండ్రి, తమ్ముడితో కలిసి నివసిస్తోంది. తండ్రి చిత్రహింసలు భరించలేక ఆమె తల్లి ఎటో వెళ్లిపోయింది. 2019లో బాలిక తండ్రి, స్నేహితులు అరుణాచలం (35), మణికంఠన్ (33) కలిసి బాలికపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.
ఈ దారుణంపై స్థానికులు గోబి మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ ముగ్గురినీ అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ జరిపిన ఈరోడ్ జిల్లా మహిళా కోర్టు (Fast Track Mahila Court)న్యాయమూర్తి మాలతి బుధవారం తీర్పు వెలువరించారు. బాలిక తండ్రికి మూడు సెక్షన్ల కింద 20 ఏళ్ల చొప్పున 60 ఏళ్ల జైలు శిక్ష (victim’s father get 60 years’ jail) విధించారు. అలాగే, మిగతా ఇద్దరికి రెండు సెక్షన్ల కింద 40 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.
ఇక మరో చోట..కన్న కూతురిపై లైంగిక దాడికి పాల్పడవద్దని హెచ్చరించిన భార్యను హతమార్చిన మురుగేశన్ (54)కు కోర్టు ఉరిశిక్ష విధిస్తూ గురువారం తీర్పునిచ్చింది. పుదుకోట్టై సమీపంలోని తేనిపట్టికి చెందిన రైతు మురుగేశన్‌కు ముగ్గురు భార్యలు, పదకొండు మంది పిల్లలు ఉన్నారు. రెండో భార్య భానుమతి కుమార్తె(17)పై మురుగేశన్ లైంగికదాడికి పాల్పడేవాడు. అడ్డుచెప్పిన భార్య తలపై రాయికొట్టి హత్య చేశాడు. కేసును విచారించిన పుదుకోట్టై మహిళా కోర్టు నిందితుడికి ఉరిశిక్ష, రూ.లక్ష జరిమానా విధించింది.