Image Used for Representational Purpose Only | (Photo Credits: ANI)

Kavali, May 8: నెల్లూరు జిల్లాలోని కావలి పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. కరోనా వచ్చిందని భార్యభర్తలు ఆత్మహత్యకు పాల్పడాలని నిశ్చయించుకున్నారు. మద్యం మత్తులో భర్త తన భార్యను మణికట్టు కోయగా ఆమె (Husband Assassinated Wife) మరణించింది. విషాద ఘటన వివరాల్లోకెళితే..కర్నూలు జిల్లా శ్రీశైలానికి చెందిన అనురాధ (32)తో కావలికి చెందిన పెసల మాల్యాద్రితో 12 ఏళ్ల క్రితం వివాహమైంది.. కావలిలోని (Nellore District Kavali) వాయునందన ప్రెస్‌ వీధిలో దంపతులు నివసిస్తున్నారు.

వీరికి ఇద్దరు పిల్లలు. మాల్యాద్రి మద్యానికి బానిసై నిత్యం భార్యతో ఘర్షణ పడేవాడు. గత నెల 25న ఇద్దరికి కరోనా సోకడంతో పిల్లలను ఇతరుల ఇంట్లో పెట్టి, వారు తమ ఇంట్లోనే హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. తాజాగా మళ్లీ పరీక్షలు చేయించుకోగా ఇద్దరికీ నెగిటివ్‌ వచ్చింది. గురువారం రాత్రి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందని మాల్యాద్రితో అనురాధ చెప్పింది.

కడపలో ఘోర ప్రమాదం, 9 మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు, జిలిటెన్‌ స్టిక్స్‌ అన్‌లోడ్ చేస్తుండగా భారీ స్థాయిలో పేలుడు

అప్పటికే చిత్తుగా మద్యం తాగి ఉన్న మాల్యాద్రి, ఇద్దరం కలసి చనిపోదామని భార్యతో చెప్పి ఆమె చేతి మణికట్టుపై బ్లేడ్‌తో కోశాడు. నరం తెగిపోవడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. అయితే తన చేతి మణికట్టు వద్ద కట్ చేసుకోబోయి ధైర్యం చాలక వదిలేశాడు. తర్వాత మల్యాద్రి బయటకి వెళ్లి ఉదయం తిరిగి వచ్చాడు. ఇంటికి తిరిగి వచ్చిన మాలాద్రి కి భార్య చనిపోయి కనిపించడంతో వెంటనే పోలీసుల వద్దకు వెళ్లి జరిగిన విషయాన్ని వివరించాడు.

వెంటనే పోలీసులు మాలాద్రిని హాస్పిటల్ కి తరలించి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.కాగా, కరోనాతో ఇబ్బంది పడుతున్నామని, ఇద్దరం చనిపోదాం అని చెప్పడంతో అందుకు తన భార్య కూడా అంగీకరించిందని అందుకే ఈ ఘాతుకానికి పాల్పడ్డానని నిందితుడు చెబుతున్నాడు.