Credits: Video Grab

Bhubaneswar, Nov 21: ఒడిశాలోని (Odisha) జాజ్‌పూర్‌ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం (Train Accident) జరిగింది. కొరాయి రైల్వేస్టేషన్‌లో ఓ గూడ్స్‌ రైలు ప్లాట్‌ఫామ్‌ (Platform) మీదకు దూసుకొచ్చింది. 10 బోగీలు బోల్తా పడగా.. వాటి కింద పడి ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు. పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. గూడ్స్‌ బోగీల కింద మరికొంతమంది చిక్కుకున్నారని సమాచారం. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.