Vice-President Polls: విపక్ష పార్టీలకు మమతా బెనర్జీ షాక్, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా టీఎంసీ ఎంపీలు, నిర్ణయం ప్రకటించిన పార్టీ జనరల్ సెక్రటరీ, మమ్మల్ని సంప్రదించకుండానే  క్యాండిడేట్ ఎంపిక అంటూ ఆగ్రహం
West Bengal CM Mamata Banerjee (Photo Credits: Facebook)

Kolkata, July 22: రాబోయే ఉప రాష్ట్రపతి ( vice-president polls) ఎన్నికలకు సంబంధించి విపక్షాల కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో ఓటింగ్‌కు దూరంగా ఉండాలని (abstain) మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (TMC) నిర్ణయించింది. ఈ విషయాన్ని టీఎమ్‌సీ ఎంపీ, ఆ పార్టీ జనరల్ సెక్రెటరీ అభిషేక్ బెనర్జీ (Abishek benarjee) గురువారం వెల్లడించారు. ఈ అంశంపై చర్చించేందుకు పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (mamatha benarjeee) పార్టీ ఎంపీలతో గురువారం సమావేశమయ్యారు. అనంతరం ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో (vice-president polls) పాల్గొనకూడదని నిర్ణయించుకున్నారు.

విపక్షాల అభ్యర్థిగా ఉన్న మార్గరెట్ ఆల్వాను ఎంపిక చేసేముందు ప్రతిపక్షాలు తమను సంప్రదించకపోవడంతో టీఎమ్‌సీ (TMC) ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నిజానికి మార్గరెట్ ఆల్వాతో (Margaret Alva) మమతకు మంచి సంబంధాలే ఉన్నాయి. అయితే, ఈ విషయంలో ముందుగా తమ పార్టీ అభిప్రాయం అడగకపోవడం మమతకు ఆగ్రహం తెప్పించింది. ఈ విషయంలో ఆమె ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్(congress), ఎన్సీపీలపై (NCP) ఆగ్రహంతో ఉన్నారు. ప్రతిపక్షాల అభ్యర్థి ఎంపిక తమను సంప్రదించకుండా జరిగిందని, ఈ పద్ధతి సరికాదని టీఎమ్‌సీ ఎంపీలు అభిప్రాయపడ్డారు. గత ఆదివారం మార్గరెట్ ఆల్వా ఎంపిక జరిగింది. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిపి మొత్తం 18 పార్టీలు సమావేశమై ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. అయితే, ఇందులో

టీఎమ్‌సీకి ఆహ్వానం అందలేదు.

Draupadi Murmu Biography: ద్రౌపది ముర్ము జీవితమంతా విషాదాలే, భర్తతో పాటు ఇద్దరు కొడుకులను పోగొట్టుకున్నా చెదరని ధైర్యం, టీచర్ నుండి రాష్ట్రపతి దాకా ద్రౌపది ముర్ము జీవిత ప్రస్థానం ఇదే.. 

ప్రతిపక్షాల్లో కాంగ్రెస్ తర్వాత అత్యధిక ఎంపీలు ఉన్న పార్టీ టీఎమ్‌సీ. ఈ పార్టీకి లోక్‌సభలో 23 మంది ఎంపీలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి 53 మంది ఎంపీలు ఉంటే, తమిళనాడుకు చెందిన డీఎమ్‌కేకు 24 మంది ఎంపీలు ఉన్నారు. ఆ తర్వాత వైసీపీకి 22 మంది ఎంపీలున్నారు.

PM Modi Greets Droupadi Murmu: కంగ్రాట్స్ ద్రౌపది ముర్ము, శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ, భారత రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి గిరిజన మహిళగా ద్రౌపది ముర్ము కొత్త చరిత్ర 

ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఎక్కువ మంది ఎంపీలున్న టీఎమ్‌సీ తప్పుకోవడం ఆ కూటమికి ఎదురుదెబ్బే. మరోవైపు ఉప రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా మద్దతు ఇవ్వాలి అని కోరేందుకు కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు ప్రయత్నిస్తున్నా మమతా బెనర్జీ అందుబాటులోకి రావడం లేదు.