దేశవ్యాప్తంగా కూరగాయల (Vegetable) ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఉత్తరాఖండ్‌లోని గంగోత్రి ధామ్‌లో (Gangotri Dham) కిలో టమాట ధర రూ.250కి చేరింది. ఉత్తరకాశి (Uttarkashi) జిల్లాలో రూ.180 నుంచి రూ.200 పలుకుతున్నది. ఉత్తరప్రదేశ్‌లోని (UP) షాజహాన్‌పూర్‌లో (Shahjahanpur) అత్యధికంగా కేజీకి రూ.162గా ఉంది.దేశవ్యాప్తంగా సగటు ధర రూ.120 దాటింది. కోల్‌కతాలో (Kolkata) రూ.152, ఢిల్లీలో (Delhi) రూ.120, చెన్నైలో రూ.117గా ఉన్నది. ఇక అత్యల్పంగా రాజస్థాన్‌లోని (Rajasthan) చురులో రూ.31గా ఉన్నది.
వీడియో ఇదిగో, అమర్‌నాథ్ గుహ మందిరంలో తెల్లవారుజామున హారతి కార్యక్రమం నిర్వహించిన పూజారులు
ఇక కూరగాయల ఉత్పత్తిదారుల కమిటీ ప్రకారం కిలో అల్లం ధరం రూ.250 దాటగా, వంకాయ రూ.100 పలుకుతున్నది. లక్నో, ఢిల్లీల్లో వారం రోజుల వ్యవధిలోనే అల్లం ధర రూ.100 నుంచి రూ.250కి చేరింది. ఇక టమాట ధర రూ.40 నుంచి రూ.120కి, వంకాయ రూ.40 నుంచి రూ.100కు చేరాయి.