Prime Minister Narendra Modi. (Photo Credits: Twitter Video Grab)

న్యూఢిల్లీ, జూన్ 29: త్రిపుర జగన్నాథ రథయాత్రలో విషాదం చోటుచేసుకుంది. జగన్నాథ భక్తులు ఇక్కడ చేపట్టిన ‘ఉల్టా రథయాత్ర’లో ఓ రథం హై టెన్షన్‌ కరెంట్‌ తీగలను తాకడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి.

ఉనాకోటి జిల్లా కుమార్‌ఘాట్‌ ప్రాంతంలో ఇనుముతో చేసిన రథం ఒకటి 133కేవీ వైర్లను తాకటంతో..పెద్దఎత్తున మంటలు చెలరేగాయని, విద్యుత్‌ఘాతంతో కొన్ని సెకన్ల వ్యవధిలోనే ఏడుగురు దుర్మరణం పాలయ్యారని, మరో 16మందికి తీవ్ర గాయాలయ్యాయని పోలీస్‌ అధికారి జ్యోతిష్‌మాన్‌ దాస్‌ మీడియాకు తెలిపారు.గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రికు తరలించి వైద్య చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు.

 వీడియో ఇదిగో, పెళ్లి ఊరేగింపు పైకి దూసుకు వచ్చిన ట్రక్కు, 5 గురు అక్కడికక్కడే మృతి, మరో తొమ్మిది మందికి గాయాలు

ఈ విషాద ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. త్రిపుర ఉల్టా రథయాత్రలో దుర్మరణం చెందిన వారి బంధువులకు రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50,000 పరిహారం ఇస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. కుమార్‌ఘాట్ వద్ద ఉల్టా రథయాత్రలో జరిగిన ప్రమాదం బాధాకరం. ఈ దుర్ఘటనలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. స్థానిక యంత్రాంగం బాధిత వారికి అన్ని విధాలా సహాయాన్ని అందిస్తోంది" అని ప్రధాని మోదీ ఒక ప్రకటనలో తెలిపారు.

చిన్న గొడవలో దారుణం, భార్యను కత్తితో పొడిచి చంపి అనంతరం ఉరివేసుకుని చనిపోయిన భర్త, ఢిల్లీలో విషాదకర ఘటన

ప్రతి మరణించిన వారి బంధువులకు PMNRF నుండి రూ. 2 లక్షల ఎక్స్-గ్రేషియా ఇవ్వబడుతుంది. త్రిపురలో జరిగిన ప్రమాదంలో గాయపడిన వారికి రూ. 50,000 ఇవ్వబడుతుంది" అని ఆయన తెలిపారు.ముఖ్యమంత్రి మాణిక్ సాహా కూడా సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. త్రిపుర చరిత్రలో ఇలాంటి దురదృష్టకర సంఘటన ఎప్పుడూ జరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడిన వారిలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.