Rahul Gandhi Twitter Row: రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతా అన్‌లాక్, సత్యమేవ జయతే అంటూ కాంగ్రెస్ అధికారిక ఖాతాలో ట్వీట్, ఢిల్లీలో అత్యాచారం, హత్యకు గురైన తొమ్మిదేళ్ళ బాలిక ఫ్యామిలీ ఫోటోను ట్వీట్ చేసిన కాంగ్రెస్ ఎంపీ
File image of Congress leader Rahul Gandhi | (Photo Credits: PTI)

New Delhi, Aug 14: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) తో పాటు ఆ పార్టీకి చెందిన ఇత‌ర నేత‌ల అకౌంట్ల‌ను ట్విట్ట‌ర్ పునరుద్దరించింది. ఇటీవ‌ల ఢిల్లీలో రేప్‌, హ‌త్య‌కు గురైన ఓ తొమ్మిదేళ్ల బాలిక ఫ్యామిలీ ఫోటోను ట్వీట్ చేసిన నేప‌థ్యంలో రాహుల్‌తో పాటు ఆ పార్టీ నేత‌ల అకౌంట్ల‌ను ట్విట్ట‌ర్ సంస్థ తాత్కాలికంగా లాక్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే శుక్ర‌వారం రాహుల్ .. ట్విట్ట‌ర్‌పై (Rahul Gandhi Twitter Row ) విరుచుకుప‌డ్డారు. భార‌తీయ రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌లో జోక్యం చేసుకుని ట్విట్ట‌ర్ సంస్థ ప్ర‌మాద‌క‌ర ఆట ఆడుతున్న‌ట్లు రాహుల్ విమ‌ర్శించారు.

కేంద్ర ప్రభుత్వ రాజకీయాలకు అనుగుణంగా నడిచే కంపెనీలకే మన దేశంలోకి అనుమతినిస్తారా అని ప్రశ్నించారు. ఈ మేరకు రాహుల్‌ గాంధీ శుక్రవారం యూ ట్యూబ్‌లో ఒక వీడియో విడుదల చేశారు. ‘‘నా అకౌంట్‌ను బ్లాక్‌ చేయడమంటే మన దేశ రాజకీయాల్లో ఆ సంస్థ తలదూర్చడమే. మన రాజకీయాలతో ఆ సంస్థ వ్యాపారం చేసుకుంటోంది. ఒక రాజకీయ నాయకుడిగా నాకీ విషయం మింగుడు పడడం లేదు’’ అని రాహుల్‌ అన్నారు. తనకు ట్విట్టర్‌లో 2 కోట్ల మంది వరకు ఫాలోవర్లు ఉన్నారని తన అకౌంట్‌ బ్లాక్‌ చేయడం ద్వారా వారి అభిప్రాయాల్ని వెల్లడించడానికి అవకాశం లేకుండా పోయిందన్నారు. ఇది కచ్చితంగా ప్రజాస్వామ్య నిర్మాణంపైనే దాడి అని రాహుల్‌ ఆ వీడియోలో పేర్కొన్నారు.

భారత స్వాతంత్య్ర దినోత్సవం, ఢిల్లీలో హైఅలర్ట్, నిఘా నీడలో ప్రధాని మోదీ ప్రసంగించే ఎర్రకోట, పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించిన ఢిల్లీ పోలీసులు

ఈ నేప‌థ్యంలో ఇవాళ ట్విట్ట‌ర్ సంస్థ కాంగ్రెస్ పార్టీ అకౌంట్ల‌ను తిరిగి అన్‌లాక్ చేసింది. అయితే అన్‌లాకింగ్‌కు (Twitter Unlocks Accounts of Congress Party) సంబంధించి ట్విట్ట‌ర్ సంస్థ ఎటువంటి వివ‌ర‌ణ ఇవ్వ‌లేద‌ని ఆ పార్టీ సోష‌ల్ మీడియా ఇంచార్జి రోహ‌న్ గుప్తా తెలిపారు. బాధితురాలి తల్లిదండ్రులు తమ ఫొటోను రాహుల్ గాంధీ వినియోగించుకునేందుకు అంగీకారం తెలపడంతో ట్విటర్ ఈ ఖాతాలను పునరుద్ధరించింది.

ఢిల్లీలో తొమ్మిదేళ్ళ బాలికపై అత్యాచారం, హత్య జరిగినట్లు కేసు నమోదైంది. ఆ బాలిక తల్లిదండ్రులను రాహుల్ గాంధీ పరామర్శించి, న్యాయం జరిగే వరకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆ బాలిక తల్లిదండ్రులతో తాను మాట్లాడుతున్నట్లు కనిపిస్తున్న ఫొటోను ఆగస్టు 4న ట్వీట్ చేశారు. ఈ విధంగా అత్యాచార బాధితురాలి వివరాలను బయటపెట్టడం చట్టవిరుద్ధమని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సహా మరికొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ట్విటర్ చర్యలు తీసుకుంది.

కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ విపిన్ యాదవ్ మాట్లాడుతూ, పార్టీకి చెందిన ఖాతాల్లో చాలా ఖాతాలు అన్‌లాక్ అయినట్లు తెలిపారు. కొందరు నేషనల్ కోఆర్డినేటర్ల ఖాతాలు ఇంకా లాక్‌లోనే ఉన్నాయన్నారు. తాము మొదటి రోజునే అంగీకార పత్రాన్ని సమర్పించామన్నారు. బాధితురాలి తల్లిదండ్రులు తమ ఫొటోను రాహుల్ గాంధీ వినియోగించడానికి అనుమతి ఇచ్చినట్లు ఓ లేఖను ట్విటర్‌కు సమర్పించినప్పటికీ, దానిని ట్విటర్ అనుమతించలేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఖాతాలపై నిషేధం విధించినందుకు తాము ట్విటర్‌పై పెద్ద ఎత్తున ఉద్యమం చేశామన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడితో ట్విటర్ ఆ లేఖను గుర్తించి, తమ ఖాతాలను అన్‌లాక్ చేసిందని చెప్పారు.

ఆగస్టు 15న రైతుల భారీ ట్రాక్ట‌ర్ ప‌రేడ్, హ‌ర్యానాలోని జింద్ జిల్లాలో రైతు జెండాల‌తో పాటు జాతీయ జెండాల‌ను ఎగుర‌వేసి నిర్వహిస్తామని తెలిపిన రైతు సంఘాలు

అన్‌లాక్ అయిన తర్వాత కాంగ్రెస్ ప్రధాన ట్విటర్ ఖాతాలో, ‘‘సత్యమేవ జయతే’’ అని ట్వీట్ చేశారు. ట్విటర్ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ, అభ్యంతరం వ్యక్తమైన ఫొటోను ఉపయోగించడానికి రాహుల్ గాంధీకి సంబంధిత వ్యక్తులు సమ్మతి తెలియజేస్తూ అధికారికంగా ఇచ్చిన లేఖ కాపీని ఆయన సమర్పించారని తెలిపారు. అపీలు ప్రక్రియలో భాగంగా ఇండియా గ్రీవియెన్స్ సెల్ ద్వారా దీనిని అందజేశారని తెలిపారు. ఆ ఫొటోలోని వ్యక్తులు లిఖితపూర్వకంగా సమ్మతి తెలియజేయడంతో ట్విటర్ తగిన చర్యలు తీసుకుందన్నారు. ఖాతాను పునరుద్ధరించామన్నారు. అత్యాచార బాధితురాలి తల్లిదండ్రులతో రాహుల్ గాంధీ కలిసి ఉన్న ఫొటోతో కూడిన ట్వీట్‌ భారత దేశంలో యూజర్లకు కనిపించదని చెప్పారు. ఆ ట్వీట్‌ భారత దేశంలో కనిపించదని తెలిపారు.

Here's Congress Party Tweet

ఇదిలా ఉంటే తొమ్మిదేళ్ల బాలిక అత్యాచారం, హ‌త్య‌కు సంబంధించిన వివ‌రాల‌ను రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఆ ఘ‌ట‌న‌లో ఇవాళ చిన్నారుల హ‌క్కుల సంస్థ ఎన్సీపీసీఆర్‌.. ఫేస్‌బుక్ అధికారుల‌కు స‌మ‌న్లు జారీ చేసింది. రాహుల్ పోస్టు చేసిన విష‌యంపై తాము ఇచ్చిన నోటీసుకు స్పందించ‌క‌పోవ‌డంతో ఎన్సీపీసీఆర్ ఆ స‌మ‌న్లు జారీ చేయాల్సి వ‌చ్చింది. మంగ‌ళ‌వారం సాయంత్రం 5 గంట‌ల త‌మ ముందు హాజ‌రుకావాల‌ని ఎన్సీపీసీఆర్ త‌న ఆదేశాల్లో పేర్కొన్న‌ది. వీలుకాని ప‌క్షంలో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా హాజ‌రుకావాల‌ని సూచించింది.

ఫోటో, వీడియో షేరింగ్ నెట్‌వ‌ర్క్ ఫ్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌.. ఫేస్‌బుక్‌కు చెందిన‌ది. బాధిత కుటుంబానికి చెందిన వీడియో ఇన్‌ష్టాలో పోస్టు రాహుల్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఈ నేప‌థ్యంలో ఫేస్‌బుక్‌కు ఎన్సీపీసీఆర్ నోటీసు ఇచ్చింది. ఈ ఘ‌ట‌న‌లో ఎటువంటి చ‌ర్య తీసుకున్న‌ట్లు ఫేస్‌బుక్ స్ప‌ష్టం చేయ‌లేదు. దీంతో ఫేస్‌బుక్‌కు ఎన్సీపీసీఆర్ స‌మ‌న్లు జారీ చేసింది. రాహుల్ త‌న ఇన్‌స్టా ప్రోఫైల్‌తో జువెనైల్ జ‌స్టిస్ యాక్ట్‌ను ఉల్లంఘించిన‌ట్లు ఆరోపించింది. పోక్సో చ‌ట్టం ప్ర‌కారం సోష‌ల్ మీడియా లేదా ఇత‌ర ప‌ద్ధ‌తుల్లో బాధిత కుటుంబ వివ‌రాల‌ను వెల్ల‌డించ‌రాదు.