Hyderabad, November 1: బెటర్ సిటీ, బెటర్ లైఫ్ అనే కాన్సెప్ట్ తో పట్టణీకరణ సవాళ్లను పరిష్కరించడానికి ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ మరియు సాంస్కృతిక శాఖ (UNESCO) ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న ప్రపంచ నగరాల దినోత్సవం (World Cities Day)గా జరుపుతుంది. ఒక నగరం యొక్క చరిత్ర, జీవనశైలి, సంస్కృతి, వైవిధ్యం, నగర ప్రజల మనోభావాలు, ఆకాంక్షలు మరియు మౌలిక సదుపాయాల ఆధారంగా సిటీ బ్రాండింగ్ మరియు మార్కెటింగ్ ముడిపడి ఉంటుంది. వీటిని ప్రామాణాలుగా తీసుకొని గురువారం ప్రపంచ నగరాల దినోత్సవం సందర్భంగా యునెస్కో ప్రపంచ వ్యాప్తంగా 66 క్రియేటివ్ నగరాలను ప్రకటించింది. ఇందులో భారతదేశం నుంచి హైదరాబాద్ (Hyderabad) మరియు ముంబై (Mumbai) నగరాలు చోటు సంపాదించాయి. యునెస్కో క్రియేటివ్ సిటీస్ యొక్క ప్రతిష్టాత్మక ట్యాగ్‌ను ఈ రెండు భారతీయ నగరాలు అందుకున్నాయి.
కాగా, మరోసారి హైదరాబాద్‌కు ఈ బ్రాండ్ తెచ్చిపెట్టింది ఇక్కడి బిర్యానీ, హలీం అనే చెప్పవచ్చు. ఆహరం విభాగంలో (Gastronomy) భాగ్యనగరం ఈ చోటు సంపాదించుకుంది. మినీ భారత్‌గా పిలువబడే హైదరాబాద్ నగరాన్ని ఫుడ్ పారడైజ్ గా చెప్తారు. అందుకే ఫుడ్ విభాగంలో క్రియేటివ్ నగరంగా చోటు సంపాదించి తన బ్రాండ్ మరియు మార్కెటింగ్ ఇమేజ్ ను మరోసారి హైదరాబాద్ నిలబెట్టుకుంది.
ఇక నగరానికి ఈ గుర్తింపు రావడం పట్ల తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ హర్షం వ్యక్తంచేశారు.
మరో నగరం ముంబైకి సినిమా విభాగంలో ఈ గుర్తింపు లభించింది. ప్రసిద్ధ బాలీవుడ్ ఇక్కడే ఉండటం బాలీవుడ్ సినిమాలకు, పాటలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది.
యునెస్కో ప్రకటించిన 66 క్రియేటివ్ నగరాలు
అఫియోంకరాహిసర్ (టర్కీ) - గ్యాస్ట్రోనమీ
అంబన్ (ఇండోనేషియా) - సంగీతం
అంగౌలోమ్ (ఫ్రాన్స్) - సాహిత్యం
అరేగు (పరాగ్వే) - చేతిపనులు మరియు జానపద కళ
అరేక్విపా (పెరూ) - గ్యాస్ట్రోనమీ
అసహికావా (జపాన్) - డిజైన్
అయకుచో (పెరూ) - చేతిపనులు మరియు జానపద కళ
బాకు (అజర్‌బైజాన్) - డిజైన్
బల్లారత్ (ఆస్ట్రేలియా) - చేతిపనులు మరియు జానపద కళ
బందర్ అబ్బాస్ (ఇరాన్ [ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్]) - చేతిపనులు మరియు జానపద కళ
బ్యాంకాక్ (థాయిలాండ్) - డిజైన్
బీరుట్ (లెబనాన్) - సాహిత్యం
బెలో హారిజోంటే (బ్రెజిల్) - గ్యాస్ట్రోనమీ
బెండిగో (ఆస్ట్రేలియా) - గ్యాస్ట్రోనమీ
బెర్గామో (ఇటలీ) - గ్యాస్ట్రోనమీ
బీల్లా (ఇటలీ) - చేతిపనులు మరియు జానపద కళ
కాల్డాస్ డా రైన్హా (పోర్చుగల్) - చేతిపనులు మరియు జానపద కళ
సిబూ సిటీ (ఫిలిప్పీన్స్) - డిజైన్
ఎస్సౌయిరా (మొరాకో) - సంగీతం
ఎక్సెటర్ (యునైటెడ్ కింగ్‌డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ మరియు నార్తర్న్ ఐర్లాండ్) - సాహిత్యం
ఫోర్టలేజా (బ్రెజిల్) - డిజైన్
హనోయి (వియత్నాం) - డిజైన్
హవానా (క్యూబా) - సంగీతం
హైదరాబాద్ (ఇండియా) - గ్యాస్ట్రోనమీ
జిన్జు (రిపబ్లిక్ ఆఫ్ కొరియా) - చేతిపనులు మరియు జానపద కళ
కార్గోపోల్ (రష్యన్ ఫెడరేషన్) - చేతిపనులు మరియు జానపద కళ
కార్ల్స్రూ (జర్మనీ) - మీడియా ఆర్ట్స్
కజాన్ (రష్యన్ ఫెడరేషన్) - సంగీతం
కొరెహిర్ (టర్కీ) - సంగీతం
కుహ్మో (ఫిన్లాండ్) - సాహిత్యం
లాహోర్ (పాకిస్తాన్) - సాహిత్యం
లీవార్డెన్ (నెదర్లాండ్స్) - సాహిత్యం
లీరియా (పోర్చుగల్) - సంగీతం
లిలియా (స్పెయిన్) - సంగీతం
మెరిడా (మెక్సికో) - గ్యాస్ట్రోనమీ
మెట్జ్ (ఫ్రాన్స్) - సంగీతం
ముహారక్ (బహ్రెయిన్) - డిజైన్
ముంబై (ఇండియా) - సినిమా
నాన్జింగ్ (చైనా) - సాహిత్యం
ఒడెస్సా (ఉక్రెయిన్) - సాహిత్యం
ఓవర్‌స్ట్రాండ్ హెర్మనస్ (దక్షిణాఫ్రికా) - గ్యాస్ట్రోనమీ
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ (ట్రినిడాడ్ మరియు టొబాగో) - సంగీతం
పోర్టోవిజో (ఈక్వెడార్) - గ్యాస్ట్రోనమీ
పోట్స్డామ్ (జర్మనీ) - సినిమా
క్వెరాటారో (మెక్సికో) - డిజైన్
రమల్లా (పాలస్తీనా) - సంగీతం
శాన్ జోస్ (కోస్టా రికా) - డిజైన్
సనందజ్ (ఇరాన్ [ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్]) - సంగీతం
శాంటియాగో డి కాలి (కొలంబియా) - మీడియా ఆర్ట్స్
శాంటో డొమింగో (డొమినికన్ రిపబ్లిక్) - సంగీతం
సారాజేవో (బోస్నియా మరియు హెర్జెగోవినా) - చిత్రం
షార్జా (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) - చేతిపనులు మరియు జానపద కళ
స్లేమాని (ఇరాక్) - సాహిత్యం
సుఖోథాయ్ (థాయిలాండ్) - చేతిపనులు మరియు జానపద కళ
ట్రినిడాడ్ (క్యూబా) - చేతిపనులు మరియు జానపద కళ
వల్లాడోలిడ్ (స్పెయిన్) - సినిమా
వల్లెడుపార్ (కొలంబియా) - సంగీతం
వాల్పారాస్సో (చిలీ) - సంగీతం
వెస్జ్‌ప్రోమ్ (హంగరీ) - సంగీతం
విబోర్గ్ (డెన్మార్క్) - మీడియా ఆర్ట్స్
విల్జాండి (ఎస్టోనియా) - చేతిపనులు మరియు జానపద కళ
వ్రాంజే (సెర్బియా) - సంగీతం
వెల్లింగ్టన్ (న్యూజిలాండ్) - చిత్రం
వోంజు (రిపబ్లిక్ ఆఫ్ కొరియా) - సాహిత్యం
వ్రోక్వా (పోలాండ్) - సాహిత్యం
యాంగ్జౌ (చైనా) - గ్యాస్ట్రోనమీ
యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్ ఇప్పుటివరకు మొత్తం 246 నగరాలను జాబితాలో చేర్చారు. ఇందులో భారతదేశం నుండి వారణాసి, చెన్నై, జైపూర్, హైదరాబాద్ మరియు ముంబై నగరాలు అప్‌డేట్ అయ్యాయి.