Union Budget 2022: పెరిగే వస్తువుల ధరలు, అలాగే తగ్గే వస్తువుల ధరలు ఇవే, దాదాపు గంటన్నరకు పైగా సాగిన ఆర్థికమంత్రి బడ్జెట్‌ ప్రసంగం
FM Nirmala Sitharaman

New Delhi, Feb 1: 2022-23 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దాదాపు గంటన్నరకు పైగా ఆర్థికమంత్రి బడ్జెట్‌ ప్రసంగం (Union Budget 2022) సాగింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం బడ్జెట్‌ అంచనాలు రూ.39 లక్షల కోట్లు అని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. అయితే, ఈ బడ్జెట్‌‌లో తమకు మేలు చేకూర్చే నిర్ణయం వస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూసిన వేతన జీవులకు మాత్రం ఈసారి నిరాశే ఎదురైంది.

ఆదాయపన్ను మినహాయింపులపై ఎలాంటి ప్రకటన రాలేదు. 5జీ సేవలు, ఈ-పాస్‌పోర్ట్, క్రిఫ్టో కరెన్సీపై ట్యాక్స్, డిజిటల్ కరెన్సీ, ఐటీ రిటర్న్స్ దాఖలులో మరో మినహాయింపు, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు డిడక్షన్ పెంపు, విద్యార్థుల కోసం వన్ క్లాస్.. వన్ ఛానల్ మొదలైనవి ఈ బడ్జెట్‌లో (Budget Session 2022) కీలక ప్రకటనలుగా నిలిచాయి. ఇక తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రభావంతో కొన్ని వస్తువుల ధరలు పెరిగితే, మరికొన్నింటి ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయి.

భారత్‌కు సొంత డిజిటల్ కరెన్సీ, త్వరలో డిజిటల్ రూపీ జారీ, రాష్ట్రాలకు రూ.1 లక్ష కోట్ల మేరకు వడ్డీ లేని రుణాలు

2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రసంగాన్ని 11.00 గంటలకు ప్రారంభించిన మంత్రి పన్నెండున్నర గంటలకు ముగించారు.కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా నేషనల్ పెన్షన్ స్కీమ్ డిడక్షన్ 14 శాతానికి పెంచుకునే అవకాశాన్ని కేంద్రమంత్రి కల్పించారు.ఐటీ రిటర్న్ దాఖలులో వెసులుబాటు కల్పించారు. ఆదాయపన్ను చెల్లింపుల్లో సవరణలకు రెండేళ్లలో అప్ డేట్ చేసుకునే అవకాశం కల్పించారు. రిటర్న్ లు సమర్పించిన రెండేళ్ల తర్వాత కూడా సవరణలు చేసుకోవచ్చు. త్వరలో ఈ పాస్ పోర్ట్ విధానం తీసుకువస్తామని మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించారు.

అసలు ఏ వస్తువుల ధరలు పెరగనున్నాయి, ఏ వస్తువుల ధరలు తగ్గనున్నాయి ఓ సారి చూద్దాం.

ధరలు పెరిగేవి:

గొడుగులు(దిగుమతి చేసుకునే వాటిపై సుంకం 20 శాతం మేర పెరగనుంది). అలాగే విదేశాల నుంచి దిగుమతి చేసుకునే అన్ని వస్తువులు. ఉదా: ప్లాస్టిక్ ఐటమ్స్, ఫర్టిలైజర్స్, ఐరన్, స్టీల్, మెడికల్ పరికరాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఆర్గానిక్ కెమికల్స్

ధరలు తగ్గేవి:

వస్త్రాలు,

మొబైల్ ఫోన్స్,

చెప్పులు,

స్టీల్ స్క్రాప్స్

నగలు

రత్నాలు

అనుకరణ ఆభరణాలు

ఎలక్ట్రానిక్ ధరించగలిగే పరికరాలు, వినగలిగే పరికరాలు మరియు ఎలక్ట్రానిక్ స్మార్ట్ మీటర్లు

మొబైల్ ఫోన్ ఛార్జర్లు

కొన్ని రసాయనాలు

ఉక్కు ఉత్పత్తులు