Washington, NOV 06: క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్(Bitcoin) మళ్లీ పుంజుకున్నది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో (US Elections) డోనాల్డ్ ట్రంప్ గెలుపు ఖాయం కావడంతో.. బిట్‌కాయిన్ ట్రేడింగ్‌లో దూసుకెళ్లింది. బైనాన్స్ క్రిప్టో ట్రేడింగ్ ప్లాట్‌ఫాంపై బీటీసీ ఎక్స్‌చేంజ్ (BTC Exchange) రేటు కొత్త రికార్డు క్రియేట్‌చేసింది. ట్రేడింగ్‌లో సుమారు 9.26 శాతం పెరుగుదల చూపించింది. ఓ దశలో ఆ కరెన్సీ విలువ 75వేల డాలర్లుగా ట్రేడ్ అయ్యింది. ఆ తర్వాత 74.2 వేల డాలర్లకు స్థిరపడింది. బిట్‌కాయిన్‌తో (Bitcoin) పాటు ఇతర క్రిప్టోకరెన్సీలు ఉత్తమ ప్రదర్శన ఇచ్చాయి. ఎథీరియమ్ కాయిన్ కూడా మార్కెటింగ్‌లో మెరుగ్గా ట్రేడింగ్ అయ్యింది.
వైట్‌హౌజ్ రేసులో ట్రంప్ దూసుకెళ్తున్నట్లు సంకేతాలు అందడంతో.. క్రిప్టో ట్రేడింగ్‌లో బిట్‌కాయిన్ సూపర్ షో ఇచ్చింది. ఎన్నికల ప్రచారం సమయంలో.. క్రిప్టో ఇన్‌వెస్టర్లకు ట్రంప్ హామీ ఇచ్చారు. న్యూయార్క్ సిటీ బార్‌లో తమ పార్టీ మద్దతుదారులకు చీజ్‌బర్గర్లు, బీర్లు కొనేందుకు బిట్‌కాయిన్‌ను ట్రంప్ వాడారు.