New Delhi, SEP 11: ఈ పథకం 24.79 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, 3.16 లక్షల ఈ-త్రీ వీలర్స్, 14,028 ఈ-బస్సులకు సపోర్ట్ ఇవ్వనున్నది. పీఎం ఈ డ్రైవ్ 88,500 ఛార్జింగ్ సైట్లకు తోడ్పాటు ఇవ్వనున్నదని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కొత్త పథకం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, ఎలక్ట్రిక్ త్రీవీలర్లు, ఈ-అంబులెన్స్‌లు, ఈ-ట్రక్స్, ఇతర అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ వాహనాల (EVs) ప్రోత్సహించడానికి రూ.3,679 కోట్ల విలువైన ప్రోత్సాహకాలను అందించనున్నది.
రాష్ట్ర రవాణా సంస్థలు, ప్రజా రవాణా సంస్థల ద్వారా 14,028 ఈ-బస్సుల సేకరణకు రూ.4,391 కోట్లు.. ఈ-అంబులెన్స్‌ల ఏర్పాటుకు రూ.500 కోట్లు కేటాయించారు. రోగుల తరలించేందుకు ఈ-అంబులెన్స్ వినియోగాన్ని ప్రోత్సహించడానికి కేంద్రం చొరవ తీసుకున్నది. ఈ-ట్రక్కుల స్వీకరణను ప్రోత్సహించేందుకు రూ.500 కోట్లు అందించారు. కేంద్రం 2015లో ఫేమ్ పథకాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే.