Newdelhi, Aug 18: యూపీలోని (UP) బులంద్ షహర్ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. పొట్టకూటి కోసం పనులకు వెళ్లి ఇండ్లకు తిరిగి వస్తున్న కార్మికులకు ఓ బస్సు మృత్యుశకటంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. బులంద్ షహర్ లోని ఓ ఫ్యాక్టరీకి చెందిన కార్మికులను పికప్ వ్యాన్ ఆదివారం ఇండ్లకు తీసుకెళుతోంది. సేలంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎదురుగా వస్తున్న ఒక ప్రైవేట్ బస్సు కార్మికుల పికప్ వ్యాన్ ను బలంగా ఢీ కొట్టింది. దీంతో పికప్ వ్యాన్ లోని పదిమంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు.
Ten people were killed and 27 injured when a pickup van collided head-on with a bus coming from the opposite direction in #Bulandshahr 🚨
More details here 👇https://t.co/y2yFwFVz7L#RoadAccident #UttarPradesh #RoadSafety
— Moneycontrol (@moneycontrolcom) August 18, 2024
ఒకే గ్రామానికి చెందినవారు
ప్రమాదంలో చనిపోయిన వారంతా అలీగఢ్ జిల్లా రాయ్ పూర్ ఖాస్ అహిర్ నాగ్లా గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. కాగా, ఇదే ప్రమాదంలో మరో 27 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు వారిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.