Uttar Pradesh CM Yogi Adityanath | File Image | (Photo Credits: PTI)

Lucknow, July 11: యూపీ ప్ర‌భుత్వం జ‌నాభా నియంత్ర‌ణ‌కు (UP Population Policy 2021) న‌డుం బిగించింది. ఆదివారం ప్ర‌పంచ జ‌నాభా దినోత్స‌వం సంద‌ర్భంగా రాష్ట్ర ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ 2021-2030కిగాను కొత్త జ‌నాభా విధానాన్ని ప్ర‌క‌టించారు. జ‌న‌నాల రేటును 2026లోపు వెయ్యికి 2.1కి, 2030లోపు 1.9కి తీసుకురావాల‌ని అందులో ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. ప్ర‌స్తుతం యూపీ జ‌న‌నాల రేటు 2.7గా ఉంది. రాష్ట్రంలో జ‌నాభాను నియంత్రించాలంటే క‌చ్చితంగా ఇద్ద‌రు పిల్ల‌ల మ‌ధ్య ఎడం పెంచాల‌ని కొత్త విధాన ప్ర‌క‌ట‌న సంద‌ర్భంగా సీఎం యోగి స్ప‌ష్టం చేశారు.

సమాజంలో అసమానతలు ఏర్పడడంతో పాటు ప్రజలు ఎదుర్కొనే ఎన్నో ప్రధాన సమస్యలకు జనాభా పెరుగుదలే (‘Increasing Population Hurdle in Way of Development) కారణమని ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ (CM Yogi Adityanath) పేర్కొన్నారు.యూపీ లా కమిషన్‌ రూపొందించిన జనాభా బిల్లు ముసాయిదా వివరాలను ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ ఆదివారం విడుదల చేశారు.

భారత్‌లో అతిపెద్ద డ్రగ్‌ రాకెట్‌ గుట్టు రట్టు, రూ. 2,500 కోట్లు విలువచేసే 354 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్న ఢిల్లీ పోలీసులు, నలుగురు నిందితులు అరెస్ట్

పెరిగిపోతున్న జ‌నాభా రాష్ట్ర‌, దేశ అభివృద్ధికి అడ్డంకిగా మారుతోంద‌ని ఆయ‌న అన్నారు. పేద‌రికానికి జ‌నాభా పెరుగుద‌ల కూడా కార‌ణం. ఈ కొత్త జ‌నాభా విధానం 2021-2030లో ప్ర‌తి క‌మ్యూనిటీని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న‌ట్లు యోగి చెప్పారు. ఈ కొత్త విధానంపై రాష్ట్ర ప్ర‌భుత్వం 2018 నుంచి ప‌ని చేస్తున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. శ‌నివార‌మే కొత్త జ‌నాభా విధాన ముసాయిదాను యూపీ విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. ఇద్ద‌రు పిల్ల‌ల విధానాన్ని ఈ కొత్త విధానం ప్రోత్స‌హిస్తోంది. దీనిని ఉల్లంఘించిన వారికి స్థానిక ఎన్నిక‌ల్లో పోటీ చేసే అవ‌కాశం ఉండ‌దు. అంతేకాదు దీనిని ప్ర‌భుత్వ ఉద్యోగాలు, స‌బ్సిడీల‌కు కూడా వ‌ర్తింప‌జేయ‌నున్నారు.

దేశంలోనే అత్యధిక జనాభా గల రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌.. జనాభా నియంత్రణ చర్యల్లో భాగంగా ఇద్దరు పిల్లల నిబంధనను తీసుకురానుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర లా కమిషన్‌.. ముసాయిదా యూపీ జనాభా బిల్లు-2021ను తయారుచేసింది. ఇది చట్ట రూపంలోకి వస్తే ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్నవారు స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హులు. అంతేకాదు.. ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికీ అర్హత ఉండదు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి భవిష్యత్తులో ఎలాంటి పదోన్నతులు లభించవు. ప్రభుత్వం నుంచి పథకాలు పొందడానికి వీల్లేదు.

ఇక ఇద్దరు పిల్లల నిబంధన పాటించే ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ప్రోత్సాహకాలు అందజేయనున్నారు. కుటుంబంలో ఎంతమంది ఉన్నా.. రేషన్‌ కార్డులో నలుగురే ఉండేలా ప్రతిపాదన చేశారు. ఈ ముసాయిదా బిల్లును రాష్ట్ర లా కమిషన్‌ తన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. దీనిపై ప్రజల నుంచి సూచనలను జులై 19వరకు స్వీకరిస్తారు. ఆగస్టు రెండోవారంలో ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశముంది.