UP Principal arrested: బాలుడ్ని బిల్డింగ్‌ మీద నుంచి తలకిందులుగా వేలాడదీసిన హెడ్‌ మాస్టర్, సోషల్ మీడియాలో వీడియో వైరల్, ఉత్తరప్రదేశ్‌లో ఘటన, హెడ్‌ మాస్టర్ మనోజ్ విశ్వకర్మ అరెస్ట్

Uttar Pradesh October 29: స్కూళ్లో అల్లరి చేస్తున్నందుకు ఓ బాలుడిపై కర్కశంగా ప్రవర్తించాడు యూపీకి చెందిన హెడ్‌ మాస్టర్‌. విద్యార్ధులు అల్లరి చేస్తే బెదిరించడం, భయం చెప్పడం చూశాం కానీ, వారిని భయబ్రాంతులకు గురి చేసేలా శిక్షించాడు. రెండో తరగతి చదవుతున్న విద్యార్ధిని బిల్డింగ్ మీద నుంచి కిందకు వేలాడదీశాడు.

మీర్జాపూర్‌లోని ఓ పాఠ‌శాల హెడ్‌మాస్టర్ మ‌నోజ్ విశ్వక‌ర్మ, రెండో త‌ర‌గ‌తి చ‌దివే విద్యార్థిని తీసుకెళ్లి బిల్డింగ్ మీది నుంచి త‌ల కిందులుగా వేలాడ‌దీశాడు. బాగా అల్లరి చేస్తున్నందుకు అతనికి శిక్ష విధించాడు. ఈ ఘటనతో స్కూల్ విద్యార్ధులంతా తీవ్రంగా భయపడ్డారు. ఆ పిల్లాడు భ‌యంతో ఏడుస్తుంటే, చుట్టూ చేరిన పిల్లలు కూడా ఏడుపు మొదలుపెట్టారు. సారీ చెబితేగానీ కిందకు దించనని హెడ్ మాస్టర్ చెప్తూ, ఆ పిల్లాడి పట్ల కర్కశంగా ప్రవర్తించాడు హెడ్‌ మాస్టర్‌.

ఇంత‌లో తోటి విద్యార్థులు గ‌ట్టిగా అర‌వ‌డంతో ఆ హెడ్ మాస్టర్ పిల్లాడిని కిందికి దించాడు. హెడ్‌మాస్టర్ చేసిన పనిని కొంద‌రు ఫోటోలు, వీడియోలు తీసి సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో సామాజిక మాధ్యమాల్లో ఆ వీడియోలు వైర‌ల్ అయ్యాయి.

కొడుకు కాదు కసాయి, ఆస్తి తన పేర రాయలేదని తల్లిని దారుణంగా చంపిన తనయుడు, విద్యుత్ షాక్‌తో చనిపోయిందంటూ నమ్మించేయత్నం, కేసు నమోదు చేసిన పోలీసులు

ఈ విష‌యం తెలుసుకున్న పిల్లాడి త‌ల్లిదండ్రులు వెంట‌నే ఆ హెడ్‌మాస్టర్‌పై ఫిర్యాదు చేయ‌డంతో పోలీసులు అత‌డిని అరెస్ట్ చేసి జువెనైల్ జ‌స్టిస్ యాక్ట్ కింద బుక్ చేశారు. బాధిత విద్యార్ధి సోనూ చాలా అల్లరి పిల్లవాడు అని, అతన్ని భయంలో పెట్టేందుకే ఇలా ప్రవర్తించినట్లు హెడ్‌మాస్టర్ తెలిపాడు. తోటి విద్యార్థుల‌ను, టీచర్లను కొరుకుతుండటంతో తన తండ్రి కోరికమేరకే భయంలో పెట్టేందుకు అలా చేసినట్లు చెప్పాడు.

 

మనోజ్ విశ్వకర్మ చేసిన పని పట్ల పలువురు నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇలాంటి ఘటనలో పిల్లల మనసు తీవ్రంగా గాయపడుతుందంటున్నారు. వారు మానసికంగా చాలా కలత చెందే అవకాశముందంటున్నారు.