Representational Image | (Photo Credits: IANS)

Nizamabad, Oct 29: ఆస్తి ముందు ఏ బంధం కూడా బ‌ల‌మైంది కాదని నేటి సమాజంలో చాలామంది నిరూపిస్తున్నారు. త‌ల్లి (Mother) పేరున ఉన్న నాలుగు ఎకరాల భూమితన పేరున రాయలేదని త‌ల్లిని అతిదారుణంగా హ‌త్య(Murder) చేసిన ఘ‌ట‌న నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్​ జిల్లా చందూర్​ మండలం లక్ష్మాపూర్​కు చెందిన సాయమ్మ(60)కు నలుగురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. సాయమ్మ కుమారుడు, కోడలితో కలిసి ఉంటోంది. ఆస్తిలో కూతుళ్లకు కూడా వాట ఇస్తుందనే అనుమానంతో తల్లిని వేధించే వాడు.

సాయమ్మ పేరుపై ఉన్న నాలుగెకరాల భూమిని తన పేరుపై రాయాలని ఆమె కుమారుడు నారాయణ కొంత కాలంగా తల్లితో గొడవ పడుతున్నాడు. ఈ నేపథ్యంలో భూమి విషయమై బుధవారం రాత్రి కూడా తల్లితో గొడవపడ్డాడు. కాగా నారాయణ భార్య కాన్పుకోసం ఇటీవల పుట్టింటికి వెళ్లింది. బుధవారం రాత్రి సాయమ్మ నిద్రపోతున్న సమయంలో ఆమె గొంతు పిసికి, గోడకేసి కొట్టి హత్య (son-killed-mother) చేశాడు. అనంతరం డ్రైనేజీలో పడి మృతి చెందిందని ఒక సారి, విద్యుత్‌ షాక్‌తో మృతి చెందిందని బంధువులకు ఫోన్‌ చేసి పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో అనుమానం వచ్చి మృతురాలి పెద్ద కుమార్తె శోభ. పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పిల్లోడు కాదు కామాంధుడు, యువతిని పొలంలోకి లాక్కెళ్లి అత్యాచారయత్నం, తిరగబడటంతో ఆమె చేతులు క‌ట్టేసి రాయితో దాడి, నిందితుడిని అరెస్ట్ చేసిన కేరళ పోలీసులు

రక్తం మరకలు కనిపించకుండా చేసి సాధారణ మృతిగా నమ్మించేందుకు ప్రయత్నించాడని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం. త్వరలోనే నిందితుడిని అదుపులోకి తీసుకుంటామని సీఐ అశోక్‌ రెడ్డి తెలిపారు. బోధన్‌ ఏసీపీ రామారావ్, రుద్రూర్‌ సీఐ అశోక్‌ రెడ్డి, వర్ని ఎస్సై అనిల్‌ రెడ్డి ఘటన స్థలానికి పరిశీలించారు.