Image used for representational purpose | (Photo Credits: PTI)

Lucknow, July 26: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ 45 ఏళ్ల కామాంధుడు.. 65 ఏళ్ల అవ్వపై అత్యాచారానికి (65-year-old woman tied up) ఒడిగట్టాడు. ఆమె ఇల్లు, పొలం ఖాళీ చేసి వెళ్లిపోవాలని చెప్పినా వినకపోవడంతో ఆమెపై అతిదారుణంగా అత్యాచారానికి (raped in Uttar Pradesh) పాల్పడ్డాడు. దారుణాతి దారుణంగా కాళ్లు, చేతులు కట్టేసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం కారం పొడి చల్లి క్రూరంగా ప్రవర్తించాడు.

కట్టిన కట్లు అలాగే ఉండటంతో ఆ వృద్ధురాలు అచేతనంగా పొలంలో పడి ఉండగా గుర్తించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మహోబా జిల్లా కబ్రాయ్‌ పట్టణంలో (Kabrai town) 65 ఏళ్ల వృద్ధురాలి నివసిస్తోంది. ఆమెకు సమీపంలోనే భరత్‌ కుశ్వహ (Bharat Kushwaha) నివసిస్తున్నాడు. వారి మధ్య ఇల్లు, పొలంకు సంబధించిన వివాదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే శనివారం అర్ధరాత్రి వృద్ధురాలిని బలవంతంగా పొలాల్లోకి లాక్కెళ్లాడు. అనంతరం ఆమె చేతులు, కాళ్లు తాడుతో కట్టేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. జననాంగాల వద్ద తీవ్రంగా గాయపర్చాడు. అనంతరం కారం పొడి చల్లి క్రూరంగా ప్రవర్తించాడు.

శాడిస్ట్ భర్త..పోర్న్ స్టార్‌గా మారాలంటూ భార్యపై ఒత్తిడి, ప్రైవేట్ భాగాలలో వస్తువు చొప్పించి తీవ్ర వేధింపులు, తట్టుకోలేక ఖర్గ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

అతడికి సేవాలాల్‌ అనే వ్యక్తి కూడా సహకరించాడు. ఆమె కనిపించకపోవడంతో ఆదివారం ఉదయం కుటుంబసభ్యులు వెతుకుతుండగా పొలం వద్ద వృద్ధురాలు తీవ్ర గాయాలతో అచేతనంగా పడి ఉంది. ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు అసిస్టెంట్ పోలీస్ సూపరింటెండెంట్ (ఎ.ఎస్.పి) రాజేంద్ర కుమార్ గౌతమ్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అయితే తమ వివరాలు చెబితే చంపేస్తామని హెచ్చరించారని కూడా బాధితురాలు పోలీసులకు చెప్పింది. బాధితురాలి సమాచారం మేరకు పోలీసులు నిందితులను గాలించి పట్టుకున్నారు. వారిపై పలు కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు.

సోషల్ మీడియాలో పరిచయం, అర్థరాత్రి ఇంటిలోకి దూరి బాలికపై అత్యాచారం, హైదరాబాద్‌లో దారుణ ఘటన, నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

అయితే తమ ఆనవాళ్లు లభించకుండా వృద్ధురాలిపై కారం చల్లినట్లు తెలుస్తోంది. వారు చేసిన గాయాలపై కారం చల్లడంతో ఆమె తీవ్రంగా అల్లాడిపోయింది. ఈ పరిస్థితిని పోలీసులకు వివరించి కన్నీళ్లు పెట్టుకుంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అయితే తాను ఉంటున్న ఇల్లు, పొలం ఖాళీ చేసి వెళ్లాలని ఒత్తిడి చేసినట్లు.. కొన్ని రోజుల కిందట దాడికి కూడా పాల్పడినట్లు తెలిపింది. వినకపోవడంతో ఇలా చేశారని తెలిసింది.