representational image (photo-Getty)

Lucknow, Mar 2: యూపీలో ఓ తాంత్రిక బాబా పైశాచికాన్ని ప్రదర్శించారు. పిల్లలు కలగలేదని ఓ మహిళను అత్యంత దారుణంగా కొట్టి చంపేయమని ఆమె కుటుంబ సభ్యులను ఆదేశించారు. ఆ మహిళ మెట్టినింటి వారు తాంత్రిక బాబా ఆదేశాలతో ఆమెను అత్యంత దారుణంగా చితకబాదడంతో ఆమె (Childless woman beaten to death) మరణించింది. ఈ విషాద ఘటన యూపీలోని షహజన్‌పూర్‌ జిల్లా పొవాయన్‌ తాలూకాలో వెలుగు చూసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శారదా దేవి అనే మహిళకు 13 ఏండ్ల కిందట సర్వేష్‌ అనే వ్యక్తితో వివాహమైంది. అయితే అప్పటి నుంచి ఆమెకు సంతానం లేకపోవడంతో అత్తింటి వారు నిత్యం వేధింపులకు గురిచేయడం ప్రారంభించారు. అత్తింటి వారు ఆమెను చంపివేస్తామని, తమ కుమారుడికి మరో వివాహం జరిపిస్తామని సైతం బెదిరించేవారు. దీనికి తోడు అక్కడ ఉండే తాంత్రిక్‌ బాబా (tantrik in Shahjahanpur) సహకారంతో శనివారం సాయంత్రం ఆమెను తీవ్రంగా కొట్టడంతో తీవ్రగాయాలతో మహిళ మరణించింది.

వయసు ఎక్కువని తోటి విద్యార్థులు గేలి, మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య, అప్పులు బాద తట్టుకోలేక మరోచోట యువకుడు బలవన్మరణం, ఇంకో చోట కులాంతర వివాహంతో యువకుడు ఆత్మహత్య, న్యాయం చేయాలని అత్తింటి ఎదుట బైఠాయించిన వివాహిత

మరుసటి రోజు శారదా దేవి మరణించినట్టు పుట్టింటి వారికి సమాచారం ఇచ్చారు. అనంతరం ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులు పరారయ్యారు. మహిళ మరణంపై ఆమె సోదరుడు మునీష్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని స్ధానిక పోలీస్‌ అధికారి నవనీత్‌ నాయక్‌ తెలిపారు. బాధితురాలి భర్త, మామను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని చెప్పారు.

శారదా దేవి ఇంటికి సోదరుడు వెళ్లినప్పుడు ఆమెను రక్తపు మడుగులో పడి ఉంది. ఆమె శరీరంలోని వివిధ భాగాలపై వేడి ఇనుముతో కాల్చారు. తాంత్రిక సూచనల మేరకు శారదాను తన బావ, అతని తల్లిదండ్రులు చంపారని మునీష్ ఆరోపించారు. సర్కిల్ ఆఫీసర్ నవనీత్ నాయక్ మాట్లాడుతూ, "ఒక మహిళ మరణం గురించి మాకు సమాచారం అందింది. ఆమె కుటుంబం నుండి వచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైంది. బాధితుడి భర్త మరియు నాన్నలను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.