Representational Image (Photo Credits: File Image)

Hyderabad, Mar 2: స్కూలులో తోలి విద్యార్థులు నీవు మా కంటే పెద్దవాడివని హేలన చేయడంతో తట్టుకోలేక ఈ యువకుడు ఆత్మహత్య (Young Man committed suicide) చేసుకున్న విషాద ఘటన వికారాబాద్‌ ఠాణా పరిధిలో సోమవారం మధ్యాహ్నం జరిగింది. విషాద ఘటన వివరాల్లోకెళితే.. వికారాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని కొత్తగడికి చెందిన సన్‌వెల్లి శంకరయ్య, చంద్రకళ దంపతులకు కుమారులు అరుణ్, మహేందర్‌(17) ఉన్నారు. నెల రోజుల క్రితం శంకరయ్య అనారోగ్యంతో మృతిచెందాడు.

తల్లి చంద్రకళ కూలీపనులు చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటోంది. మహేందర్‌ కొత్తగడిలోని ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. వయసు ఎక్కువగా ఉండటంతో కాలేజీలో స్నేహితులు ఆటపట్టిస్తున్నారని ఓపెన్‌లో టెన్త్‌ ఫీజు కడతానని ఇంట్లో చెప్పగా వారు వద్దని వారించారు. అయితే సోమవారం తల్లి చంద్రకళ, అన్న అరుణ్‌లు పని నిమిత్తం వికారాబాద్‌కు వచ్చారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఇంటికి వచ్చి చూడగా తలుపులు వేసి ఉన్నాయి.

స్థానికుల సాయంతో తలుపులు తీసి చూడగా మహేందర్‌ దూలానికి ఉరివేసుకొని వేలాడుతూ కనిపించాడు. వెంటనే కిందికి దించి వికారాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వయసులో తమ కంటే పెద్దవాడివంటూ తరచూ తోటి విద్యార్థులంతా మహేందర్‌ను హేళన చేయడంతో మనోవేదనకు గురై ఆత్మహత్య (class 8th student commits suicide) చేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తల్లి చంద్రకళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు.

అద్దె అడిగినందుకు యజమానినే చంపేశాడు, మరోచోట ఆర్టీసీ బస్సులోనే కుప్పకూలిన పెద్దాయన, అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి, బెంగుళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఘటన

ఇక నిజామాబాద్ జిల్లాలో ఓ యువకుడు ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై నవీన్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మహత్య చేసుకున్న నర్సింలు తండ్రి లక్ష్మయ్య మూడు నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ విషయంలో జరిగిన ఖర్చుకు అప్పులు చేశారు. అప్పులు చెల్లింపు విషయంలో కుటుంబంలో తగాదాలు ఏర్పడ్డాయి.అప్పులు చెల్లించడానికి డబ్బులు లేకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన నర్సింలు తన పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

‘‘నా చావుకు ఎవరు కారణం కాదు. అందరిని బాధపెట్టాను. తండ్రి మాట నిలబెట్టుకోలేకపోయా. జై కేసీఆర్‌.. టీహెచ్‌ఆర్, కేటీఆర్, ఎమ్మెల్సీ కవితకు జై.. జై తెలంగాణ’’ అని రాసిన సూసైడ్‌ నోట్‌ లభించింది. దానిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై పేర్కొన్నారు. కాగా నర్సింలుకు ఆరు నెలల క్రితం వివాహామైనట్లు సమాచారం.

యూపీ హత్రాస్‌లో మరో దారుణం, లైంగిక వేధింపుల బాధితురాలి తండ్రి హత్య, జైలు నుంచి బయటకు వచ్చి కాల్చి చంపిన నిందితుడు, న్యాయం చేయాలంటూ కన్నీరు మున్నీరుగా విలపించిన భాదితురాలు

హూజురాబాద్ జమ్మికుంటలో మరో విషాదం చోటు చేసుకుంది. జమ్మికుంట పట్టణంలోని కృష్ణ కాలనీలో నివాసం ఉంటున్న దాస్యపు సాయిచైతన్య, మునిగంటి మమత 2017లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి రెండున్నరేళ్ల కూతురు ఉంది. సాయిచైతన్య కులాంతర వివాహం చేసుకున్నాడని తల్లిదండ్రులు సత్యనారాయణ, పద్మ అతన్ని వదిలేసి కరీంనగర్‌లో ఉన్నారు. ఈ క్రమంలో చిన్నచిన్న గొడవలు జరిగి, మమత కూడా సాయిచైతన్యను వదిలేసి, కూతురిని తీసుకొని పుట్టింటికి వెళ్లింది.

దీంతో ఒంటరైన అతను గత డిసెంబర్‌లో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని, ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత మృతుడి తల్లిదండ్రులు కృష్ణ కాలనీలోని తమ ఇంట్లోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో భర్త ఆత్మహత్య చేసుకోగా కూతురికి న్యాయం చేయాలని ఓ వివాహిత తన అత్తింటి ఎదుట బైఠాయించింది. తాజాగా తాను భర్త ఇంట్లోనే ఉంటానని, తన కూతురికి న్యాయం చేయాలంటూ మమత కుటుంబసభ్యులతో కలిసి సోమవారం వారి ఇంటి ఎదుట బైఠాయించింది.

సాయిచైతన్య తల్లిదండ్రులు స్పందించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఎస్సై ప్రవీణ్‌రాజ్‌ తన సిబ్బంది కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆందోళన విరమించాలని సూచించినా ఆమె వినలేదు. దీంతో సాయిచైతన్య తండ్రిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. సాయిచైతన్య ఆత్మహత్య చేసుకున్నప్పుడు కేసు నమోదు చేశామని, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విచారణ చేపట్టి, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎస్సై పేర్కొన్నారు.

నాంపల్లి లాడ్జిలో కోడలిపై మామ అత్యాచారం, పోలీసులకు ఫిర్యాదు చేసిన కోడలు, దేశ రాజధానిలో హోటల్‌ గదిలో మోడల్‌పై అత్యాచారం

శివ్వంపేట మండలం పిల్లుట్ల గ్రామంలో జరుగుతున్న జాతరకు వెళ్లి దాచారం నుంచి నర్సాపూర్‌ వైపు బైక్‌పై వస్తుండగా కారు ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందగా, నలుగురు పిల్లలకు తీవ్ర గాయాలైయ్యాయి. ఈ ఘటన సోమవారం నర్సాపూర్‌– హైదరాబాద్‌ రహదారిలోని సబ్‌ స్టేషన్‌ సమీపంలో చోటు చేసుకుంది. నర్సాపూర్‌ ఎస్సై గంగరాజు కథనం మేరకు.. గుమ్మడిదల మండలం దాచారం గ్రామానికి చెందిన సంగని నరేశ్‌ (26)వరుసకు అల్లుళ్లు అయిన చంటిబాబు (15), లక్ష్మినర్సింహ (12), భానుచందర్‌ (10), అఖిల్‌ (8)లను బైక్‌పై ఎక్కించుకొని జాతరకు వెళ్తున్నాడు.

ఈ క్రమంలో నర్సాపూర్‌ వస్తుండా కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో నరేశ్‌ అక్కడికక్కడే మృతి చెందగా, నలుగురు పిల్లలకు తీవ్ర గాయాలైయ్యాయి. వీరిని వెంటనే 108 అంబున్స్‌లో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుడికి భార్య మంజుల ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని నరేశ్‌ శవాన్ని పోస్టు మార్టం కోసం నర్సాపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించనట్లు తెలిపారు.కారు డ్రైవర్‌ అజాగ్రత్తగా నడపడం వల్ల ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.