![](https://test1.latestly.com/wp-content/uploads/2023/01/Amroha-Chief-Medical-Officer-Rajeev-Singhal.jpg)
Lucknow, Jan 4: యూపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కాన్పు కోసం వచ్చిన మహిళ కడుపులో టవల్ ఉంచేసి (Doctor leaves towel inside) నిర్లక్ష్యంగా ఆపరేషన్ చేశాడు అక్కడి వైద్యుడు. అమ్రోహాలోని బాన్స్ ఖేరీ గ్రామంలోని ఓ ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సంఘటన వివరాల్లోకెళ్తే.. నజరానా అనే మహిళ నెలలు నిండటంతో ప్రసవ వేదనతో సైఫీ నర్సింగ్ అనే ప్రైవేటు ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యింది. ఐతే అక్కడి వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆమె కడుపులో (woman's stomach) టవల్ ఉంచేసి ఆపరేషన్ చేశారు డాక్టర్ మత్లూబ్.
ఆపరేషన్ తర్వాత ఆ మహిళకు కడుపు నొప్పి ఎక్కువ అవ్వడంతో తాళలేక సదరు డాక్టర్‌కి ఫిర్యాదు చేసింది. ఐతే బయట చలి ఎక్కువగా ఉండటం వల్లే అలా అనిపిస్తుందని చెప్పి మరో ఐదు రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉంచేశారు. కానీ ఆమెకు ఇంటికి వచ్చినా..ఆరోగ్యం మెరుగవ్వకపోవడంతో.. భర్త షంషేర్ అలీ ఆమెను అమ్రెహాలోని మరో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లాడు బాధితురాలి కడుపులో టవల్ ఉందని, ఆపరేషన్ చేసి తీసేసినట్లు అక్కడి ఆస్పత్రి వైద్యులు అలీకి తెలిపారు. దీంతో భర్త ఒక్కసారిగా షాక్ తిన్నాడు.
దీంతో అలీ చీఫ్ మెడికల్ ఆఫీసర్(సీఎంఓ)కు సదరు ఆస్పత్రి నిర్వాకంపై ఫిర్యాదు చేశాడు. మీడియా కథనాల ద్వారా విషయం తెలుసుకున్న చీఫ్ మెడికల్ ఆఫీసర్(సీఎంఓ) రాజీవ్ సింఘాల్ ఈ విషయంపై సమగ్ర విచారణ చేయమని నోడల్ అధికారి డాక్టర్ శరద్‌ను ఆదేశించారు. విచారణ నివేదిక రాగనే పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభిస్తారని (CMO orders probe) సీఎంవో అధికారి సింఘాల్ చెప్పారు.