
Lucknow, Mar 2: దేశంలో రోజు రోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఎన్నిచట్టాలు తెచ్చినా కామాంధుల్లో మార్పు రావడం లేదు. చిన్న పిల్లల దగ్గర నుంచి ముదుసలి వరకు ఎవర్నీ వదలడం లేదు కామాంధులు. తాజాగా యూపీలో దారుణ ఘటన (Uttar Pradesh Horror) చోటు చేసుకుంది. నాలుగేళ్ల బాలికపై అత్యాచారం (4-Year-Old Girl Raped By Uncle) జరిగింది, ఆమె ఇంటికి తరచుగా వచ్చే 'మామయ్య' అని పిలిచే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు. నిందితుడిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.
నివేదికల ప్రకారం, నిందితుడు సోమవారం సాయంత్రం బాలిక ఇంటికి వచ్చి మిఠాయిలు ఇస్తానని (After Being Lured With Candies) ఆమెను తన వద్దకు రప్పించి అత్యాచారానికి పాల్పడ్డాడు. కూలి పని చేస్తున్న ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోమవారం సాయంత్రం ఆమె కనిపించకుండా పోయిందని బాధితురాలి తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. నాలుగు గంటల తర్వాత ఆమె ఇంటి సమీపంలో పాక్షిక స్పృహలో కనిపించింది. ఆమె ప్రైవేట్ భాగాలకు తీవ్ర గాయాలు అయ్యాయి.
బాధితురాలు తనకు జరిగిన బాధను తల్లిదండ్రులకు వివరించింది. ఆమె కుటుంబ సభ్యులు సమీపంలోని దుకాణంలో పనిచేస్తున్న నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అత్యాచారం, పోక్సో చట్టంలోని సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది. బాలికను వైద్యపరీక్షలకు పంపామని, ఆమె పరిస్థితి నిలకడగా ఉందని, నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపామని ఎస్‌హెచ్‌ఓ తెలిపారు.