Uttar Pradesh CM Yogi Adityanath | File Image | (Photo Credits: PTI)

Lucknow, Feb 1: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి (Uttar Pradesh Chief Minister) యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) మత మార్పిడులపై కొత్త ట్విస్ట్ ఇచ్చారు. ఎవరినీ బలవంతంగా మతం మార్చరాదని, అలా చేసిన వారికి పదేళ్లు జైలు శిక్ష తప్పదన్నారు. అయితే వివిధ ప్రలోభాల కారణంగా ఇతర మతాల్లోకి వెళ్లిన వారు హిందూ మతంలోకి రావాలనుకుంటే స్వేచ్ఛగా రావొచ్చన్నారు.మహారాష్ట్ర జల్‌గావ్ జిల్లా జామ్‌నెర్‌లో జరుగుతున్న బంజారా కుంభ్ 2023 కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మత మార్పిడులకు వ్యతిరేకంగా (Religious Conversion Row) రూపొందించిన చట్టం 2020 నవంబర్ నుంచే యూపీలో అమల్లో ఉందని తేల్చి చెప్పారు.

దేవాలయాల పేరిట డబ్బులు వసూలు చేయడంపై మండిపడిన మద్రాస్ హైకోర్టు, గుడులు లాభాల వేదికలుగా మారకూడదని స్పష్టం,ఆ వెబ్‌సైట్‌లను మూసివేయాలని ఆదేశాలు

ఘర్ వాపసీ చేసుకునేవారు తిరిగి హిందువులుగా జీవించవచ్చని. వారిపై మత మార్పిడులకు (Religious Conversion) వ్యతిరేకంగా రూపొందించిన చట్టం వర్తించదని యూపీ సీఎం తెలిపారు. కులాన్ని, ప్రాంతీయవాదాన్ని పక్కనపెడితే ప్రపంచంలో ఏ శక్తీ కూడా భారత్ పురోగతిని అడ్డుకోలేదని సీఎం చెప్పారు.500 ఏళ్ల తర్వాత అయోధ్యలో భవ్య రామాలయ నిర్మాణం జరుగుతుందని, వచ్చే ఏడాది ఈ సమయానికి అందరూ శ్రీరాముడిని దర్శించుకోగలుగుతామన్నారు. దేశంలో విధ్వంసానికి గురైన అన్ని దేవాలయాలను మళ్లీ నిర్మించాలని యోగి పిలుపునిచ్చారు.

వేతన జీవులకు ఊరటనిచ్చిన కేంద్రం, రూ. 7లక్షల ఆదాయం వరకు ఎలాంటి ట్యాక్స్‌ లేదని ప్రకటన, పన్ను మినహాయింపు రూ.5లక్షల నుంచి 7లక్షలకు పెంపు

దీనిపై ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. భారత్‌ను హిందూ రాష్ట్రంగా ప్రకటిస్తారనే ప్రచారానికి యోగి తాజా వ్యాఖ్యలు ఆజ్యం పోస్తున్నాయని వారంటున్నారు. రామ్‌చరిత్ మానస్‌ను నిషేధించాలంటూ సమాజ్‌వాదీ పార్టీ నేత మౌర్య డిమాండ్ చేయడం దుమారం రేపింది. దీనికి కౌంటర్‌గానే యోగి ఈ వ్యాఖ్యలు చేసినట్లు రాజకీయ పండితులు చెబుతున్నారు.