Uttar Pradesh: యూపీలో దారుణం, బాలికపై విచక్షణారహితంగా కర్రలతో దాడి, వీడియో తీస్తూ పైశాచికంగా ప్రవర్తించిన అక్కడున్న వ్యక్తులు, ట్విట్టర్ వేదికగా యూపీ ప్రభుత్వంపై మండిపడిన ప్రియాంకా వాద్రా
Priyanka Gandhi, Yogi Adityanath (Photo Credits: PTI)

Lucknow, Dec 29: యూపీలో దారుణం చోటుచేసుకుంది. యూపీలోని అమేథీ పరిధిలో ఒక యువతి తమ ఇంట్లో చోరీ చేసిందనే ఆరోపణలతో కొందరు బాలికపట్ల క్రూరంగా ప్రవర్తించారు. ఆమెను జుట్టుపట్టుకొని లాక్కొచ్చి ఇంటిలో బంధించారు.

ఇద్దరు వ్యక్తులు ఆమెను నేలపై తొసేసి.. మరో వ్యక్తి ఆమెపై కర్రలతో విచక్షణ రహితంగా (Amethi Attackers Of Dalit Girl) కొట్టారు.బాలికను కొడుతూ ఉంటే అక్కడ ఉన్నవారు వీడియో తీస్తూ పైశాచికంగా (Girl Tortured By A Family) ప్రవర్తించారు. ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో అమేథీ పోలీసులు నిందితులపై పోక్సో, ఎస్సీఎస్టీ అట్రాసిటీ కింద కేసులను నమోదు చేశారు.

దీనిపై కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ ( Priyanka Gandhi Vadra) ట్వీటర్‌లో మండిపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను షేర్‌ చేశారు. మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు ఆగడం లేదన్నారు. యోగీ ప్రభుత్వం నిద్రపోతుందని తీవ్రమైన ఆరోపణలు చేశారు. నిందితులను 24 గంటల్లో అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

రైతులకు కొత్త ఏడాది కేంద్రం నుంచి శుభవార్త, జనవరి 1వ తేదీన పీఎం కిసాన్ 10వ విడత నిధులు విడుదల

ఈ ఘటనపై కేంద్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ ట్వీటర్‌ వేదికగా స్సందించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని అధికారులను ఆదేశించారు.

Here's Priyanka Gandhi Vadra Tweet

అమేథీ పోలీసు అధికారి అర్పిత్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఒకరిని అరెస్టు చేసినట్లు తెలిపారు. మిగతావారికోసం గాలిస్తున్నట్టు తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ ఘటన ప్రస్తుతం యూపీలో కలకలం రేపుతుంది.