Representational Image (Photo Credits: File Image)

Lucknow, Mar 7: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో తనపై అత్యాచారం జరిగిందని ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ఓ యువతి ఏకంగా అదనపు డీజీపీ ఆఫీస్‌లో విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. భాగ్‌పట్‌ జిల్లాలోని సుంగర్హి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామంలో ఆరు నెలల క్రితం 17 ఏండ్ల యువతిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు.

అప్పుడే బాధితురాలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు పట్టించుకోకుండా అసలు నీపై అత్యాచారమే జరగలేదని, నువ్వు పెట్టింది తప్పుడు కేసు అని బాధితురాలిని దబాయించారు.దాంతో ఇవాళ ఆమె బరేలీలో అదనపు డీజీపీ కార్యాలయానికి వెళ్లింది. అక్కడ ఏడీజీపీ పీసీ మీనా లేకపోవడంతో వెంట తీసుకెళ్లిన విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.

ఉద్యోగితో వ్యాపారవేత్త గే సంబంధం, రాత్రి పని కానిచ్చిన తర్వాత పెళ్లి గొడవ, వ్యాపారిని దారుణంగా చంపేసిన ఉద్యోగి

వెంటనే పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.