Lucknow, May 23: ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుంటానని చెప్పిన కుమార్తెను ఓ తండ్రి (Uttar Pradesh Shocker) చంపేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. రూరల్ అడిషనల్ ఎస్పీ రాజ్‌కుమార్ అగర్వాల్ తెలిపిన వివరాల ప్రకారం.. షాహి పోలీస్ స్టేఫన్ పరిధిలోని సీహోర్ గ్రామంలో చెరుకు తోట వద్ద ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహాం లభించిందని తెలిపారు. దీంతో బరేలీ పోలీసులు శుక్రవారం ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారని పేర్కొన్నారు. అయితే ఆ మహిళ రాంపూర్ జిల్లాలోని మిలక్ ప్రాంత నివాసిగా గుర్తించినట్లు వెల్లడించారు.
కాగా రెండు రోజుల క్రితం ఆమె తప్పిపోయిందని, అయితే దీనిపై ఆమె తల్లిదండ్రులు ఎటువంటి ఫిర్యాదు చేయలేదన్నారు. దీంతో తండ్రిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తనే హతమార్చినట్టు ఒప్పకున్నాడని అగర్వాల్ తెలిపారు. తన కుమార్తె ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకుంటానన్నందుకు కోపంతో చంపినట్లు (Father kills daughter) నిందితుడు ఒప్పుకున్నాడని అన్నారు. ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు, మృతదేహాన్ని శవపరీక్ష కోసం ఆస్పత్రికి పంపినట్లు తెలిపారు.
పొరుగున ఉన్న గ్రామానికి చెందిన యువకుడితో ఎఫైర్ ఉన్నందున తన కుమార్తెను గొంతు కోసి చంపినట్లు ఆ మహిళ తండ్రి చెప్పారు. మృతదేహాన్ని బరేలీ జిల్లాలోని షాహి ప్రాంతంలో స్వాధీనం చేసుకున్నందున, మేము ఇక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేసి, మృతదేహాన్ని శవపరీక్ష కోసం పంపించాము. నిందితుడు మా అదుపులో ఉన్నాడు. శవపరీక్షలో ఆమె హత్య చేయబడిందని నిర్ధారించిన తరువాత చంపేసిన తండ్రిని జైలుకు పంపబడుతారని ఎస్పీ అగర్వాల్ తెలిపారు.