Uttar Pradesh Shocker: నీవు నపుంసకుడివి అంటూ వదిన హేళన, తట్టుకోలేక దారుణంగా ఆమెను హత్య చేసిన బావ, యూపీలో వారణాసిలో ఘటన, నిందితుడి వీడియో క్లిప్ బయటకు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Image used for representational purpose only | (Photo Credits: PTI)

Lucknow, July 21: యూపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నపుంసకుడు అన్నందుకు వదినని ఆమె బావ అత్యంత దారుణంగా హత్య చేశాడు. యూపీ వారణాసి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం ‘డయల్ 112’ హెల్ప్‌లైన్‌లో వచ్చిన కాల్‌కు ప్రతిస్పందనగావార‌ణాసిలోని మ‌హ‌మూర్‌గంజ్ ప్రాంతంలోని ఒక చిరునామాకు చేరుకున్నారు. అక్కడ మహిళా డాక్టరును (Varanasi Woman doctor) ఆమె బావ అత్యంత దారుణంగా హ‌త్య చేశాడని తెలిపారు. మృతురాలు, ప్రఖ్యాత క్యాన్సర్ నిపుణుడు, మాజీ ఎమ్మెల్యే రజనీకాంత్ దత్తా (former MLA Rajnikant Dutta) కోడలుగా పోలీసులు గుర్తింంచారు.

కుటుంబ వివాదం నేపథ్యంలో డాక్టరు సప్నను ఆమె బావ అనిల్ ద‌త్తా హ‌త్య (brutally killed by her brother-in-law) చేశాడ‌ని ద‌ర్యాప్తులో వెల్ల‌డైంద‌ని పోలీసులు తెలిపారు. అనిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స‌ప్నపై తాను ప‌దునైన ఆయుధాల‌తో (కత్తెర) దాడి చేయ‌డంతో తీవ్ర గాయాల‌పాలై ఆమె మ‌ర‌ణించింద‌ని (Dr Sapna Dutta murdered) అనిల్ త‌న నేరం అంగీక‌రించారు.ఈ ఘటనకు సంబంధించి ఒక వీడియో క్లిప్ బయటకు వచ్చింది.

నాన్నా లేక కామాంధుడా..మహిళతో అక్రమసంబంధం, ఆమె కూతురిపై ఆరు నెలల నుంచి అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన వెంకటగిరి పోలీసులు, పరారీలో నిందితుడు

ఈ వీడియోలో అనారోగ్యంతో ఉన్న నా తల్లిదండ్రులను చూసేందుకు నేను వెళ‌తుండ‌గా వ‌దిన త‌న‌ను చూసి పెద్దగా న‌వ్వుతూ న‌పుంస‌కుడంటూ (impotent) నిందించింద‌ని అది తట్టుకోలేక ఆమెపై కత్తెరతో దాడి చేశానని దీంతో ఆమ తలకు బలమైన గాయం అయిందని తెలిపారు. ఆ గాయమే ఆమె మరణానికి కారణమైందని వీడియో క్లిప్‌లో నిందితుడు అనిల్ చెబుతున్నాడు. ఆమె నన్ను, నా సోదరుడిని గతంలో కూడా నపుంస‌కులంటూ నిందించింద‌ని చెప్పుకొచ్చాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, సిసిటివి ఫుటేజీని పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

అవి పోర్న్ వీడియోలు కావు, మేము అసలు సెక్స్ వీడియోలే చేయలేదు, ముంబై పోలీసుల మీద నాకు నమ్మకం ఉంది, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా అరెస్ట్ వార్తలపై స్పందించిన నటి గెహనా వశిష్ట్‌

మరొక సంఘటనలో, 48 ఏళ్ల మహిళను తన 18 ఏళ్ల కుమారుడు గొంతు కోసి చంపేశాడు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని వాసాయి ప్రాంతంలో మంగళవారం ఈ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తల్లి-కొడుకు తరచుగా సమస్యలపై గొడవ పడుతుండేవారని.. మంగళవారం కూడా వారి మధ్య వాగ్వాదం చెలరేగింది, దీని తరువాత నిందితుడు తన తల్లిని బెల్ట్ ఉపయోగించి గొంతు కోసి చంపాడని ఆరోపించారు. బాధితురాలి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పరీక్ష కోసం పంపించగా నిందితుడిని అరెస్టు చేశారు.

Source Link