Representational Image (Photo Credits: Pixabay)

Kanpur, April 26: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓ విచిత్రకర ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడి ప్రియురాలు అతని తండ్రితో జంప్‌ అయ్యింది. ఏడాది క్రితం యువతిని లవర్ తన ఇంటికి తీసుకెళ్లాడు. తండ్రితో పరిచయం చేసుకున్న యువకుడి ప్రియురాలు తర్వాత అతనితో పారిపోయింది.

కాన్పూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కమలేష్ అనే వ్యక్తి కుమారుడికి 20 ఏళ్ల యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలో ఆ యువతి తరచుగా ప్రియుడి ఇంటికి వచ్చేది. అలా ప్రియుడి తండ్రితో పరిచయం పెంచుకుంది. ప్రియుడు ఇంట్లో లేని సమయంలో ప్రియుడి తండ్రి కమలేష్‌కు దగ్గరయింది. ఆ బంధం ప్రేమగా మారింది. దీంతో 2022 మార్చిలో ఇద్దరూ ఇంటి నుండి పరార్ అయ్యారు.

వీడియో ఇదిగో, మెట్రోలో ఔటయ్యేదాకా హస్తప్రయోగం చేసుకున్న యువకుడు, పక్కన యువతి ఉన్నా పట్టించుకోని రసికుడు

యువతి కుటుంబ సభ్యులు చకేరి పోలీస్ స్టేషన్‌లో కిడ్నాప్‌ కేసు పెట్టారు. కమలేష్ కుమారుడిని పోలీసులు విచారించగా.. ఆ యువతి కమలేష్‌ను కలిసేందుకు వచ్చేదని చెప్పడంతో నిజం వెలుగు చూసింది. ఏడాది పాటు వారి కోసం వెతికిన పోలీసులు ఇద్దర్నీ ఢిల్లీలో గుర్తించారు. దేశ రాజధానిలో ఇద్దరూ సహజీవనం సాగిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.

వీడియో ఇదిగో, రైల్వే స్టేషన్‌లో మహిళను చూస్తూ హస్తప్రయోగం చేసుకున్న యువకుడు, వీడియో వైరల్

ఇదిలా ఉంటే ఇష్టపూర్వకంగానే కమలేష్‌తో వెళ్లినట్లు యువతి చెప్పడంతో షాక్‌ అయిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకున్నారు. కమలేష్ పోలీసుల అదుపులో ఉండగా, త్వరలో మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. తదుపరి విచారణలు కొనసాగుతున్నాయి.