Flooding due to heavy rain in Uttarakhand (Photo Credits: PTI)

Dehradun, October 20: ఉత్తరాఖండ్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు (Uttarakhand Rains), కొండచరియలు విరిగిపడి మృతి చెందిన వారి సంఖ్య 46కు (Death Toll Rises to 46) చేరింది. భారీగా ఆస్తినష్టం సంభవించింది. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి బుధవారంనాడు కుమావ్ ప్రాంతంలో పర్యటించి పరిస్థితిని, సహాయ కార్యక్రమాలను సమీక్షించారు. రాష్ట్రానికి పెద్దఎత్తున నష్టం వాటిల్లినట్టు మీడియాకు తెలిపారు. రాష్ట్రం కోలుకోవడానికి సమయం తీసుకుంటుందని చెప్పారు.

సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రతి జిల్లాకు రూ.10 కోట్లు చొప్పున మంజూరు చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు చొప్పున ముఖ్యమంత్రి పరిహారం ప్రకటించారు. కాగా, బుధవారం నుంచి వర్షపాతం క్రమంగా తగ్గుముఖం పడుతుందని, వారాంతానికి మళ్లీ పొడి వాతావరణం నెలకొంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ వారంలో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు కావడంతో వరదలుగా రూపాంతరం చెంది, కొండచరియలు విరిగిపడి పెద్దఎత్తున ఆస్తినష్టం సంభవించింది. ఆర్మీ, ఎన్‌డీఆర్ఎఫ్‌ బృందాలతో పాటు స్థానిక యంత్రాంగం సహాయ, పునరావాస కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టాయి.