New Delhi, February 20: 2012 దిల్లీ సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషుల్లో ((Nirbhaya Case Convicts) ఒకరైన వినయ్ కుమార్ శర్మ (Vinay Kumar Sharma) తాను ఉండే సెల్ లో గోడకు తలను బాదుకొంటూ తనను తానుగా గాయపరుచుకునే ప్రయత్నం చేశాడు. ఫిబ్రవరి 16న జరిగిన ఈ ఘటన ద్వారా వినయ్ శ్మర్మ తల స్వల్ప గాయాలైనట్లు తీహార్ జైలు (Tihar Jail) అధికారులు వెల్లడించారు.
నిర్భయ కేసులో మరణశిక్ష పడిన నలుగురు దోషులకు 2020 మార్చి 3న ఉదయం 6 గంటలకు దిల్లీలోని తీహార్ కేంద్ర కారాగారంలో ఉరి తీయాలంటూ దిల్లీలోని పాటియాలా హౌజ్ కోర్టు ఇటీవలే సరికొత్తగా డెత్ వారెంట్ (Death Warrant) ను జారీ చేసింది.
తనకు పడిన మరణశిక్షను తప్పించుకునేందుకు 26 ఏళ్ల వినయ్ శర్మ ఇప్పటికే చట్టపరమైన అన్ని అవకాశాలను ఉపయోగించుకున్నాడు. ఇక చట్టపరంగా ఏ రకమైన అవకాశం లేకపోవడంతో వినయ్ శర్మ మరిన్ని చావు తెలివితేటలు చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికే ఉరిశిక్ష అమలు చేస్తారు. ఈ విషయం గ్రహించిన వినయ్ శర్మ, తానొక మానసిక రోగి అని, ఉరిశిక్షకు అర్హుడిని కాదంటూ ఇటీవల కోర్టులో పిటిషన్ వేశాడు, అయినప్పటికీ కోర్ట్ అతడి పిటిషన్ ను తిరస్కరించింది.
ఉరిశిక్ష తేదీ సమీపిస్తున్న కొద్దీ, ఎన్ని రకాల నాటకాలు వేయాలో అన్నీ వేస్తున్నాడు. తనకు తాను గాయం చేసుకోవడమో, అనారోగ్యాన్ని కొని తెచ్చుకునే ప్రయత్నం లాంటివి చేస్తున్నాడు. ఇటీవల జైలులో ఆహారం తీసుకోకుండా నిరాహార దీక్షకు కూడా కూర్చున్నాడు, కడుపు కాల్చుకోవడం ఇష్టం లేక అదీ వదిలేసి, ఇప్పుడు తలను బాదుకున్నాడు.
Here's the update:
Tihar Jail official: One of the death row convicts of 2012 Delhi gang-rape case, Vinay had attempted to hurt himself by banging his head against a wall in his cell, on 16th February. He had received minor injuries.
The four convicts of the case will be executed on 3rd March.
— ANI (@ANI) February 20, 2020
ఈ కేసులో వినయ్ తో పాటు ముకేశ్ కుమార్ సింగ్ (32), పవన్ గుప్తా (25), అక్షయ్ కుమార్ (31)లు ఉన్నారు. పవన్ గుప్తా మినహా మిగతావారంతా తమ చట్టపరమైన అవకాశాలను వినియోగించుకున్నారు. ఇలా చట్టపరమైన అవకాశాలతో ఇప్పటికే ఉరిశిక్ష అమలును రెండు సార్లు వాయిదా వేయించుకున్నారు. డెత్ వారెంట్ జారీ అవడం ఇది మూడోసారి.
కాగా, డెత్ వారంట్ జారీ పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన నిర్భయ తల్లి, మార్చి 3న దోషులను ఖచ్చితంగా ఉరితీస్తారని తాను నమ్ముతున్నట్లు విశ్వాసం వ్యక్తంచేశారు.