New Delhi, July 08: చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో ( Vivo ) పన్ను ఎగవేతకు పాల్పడిందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ప్రకటించింది. అందుకోసం చైనాకు రూ.62,476 కోట్లు తరలించిందని గురువారం తెలిపింది. ఇది భారత్‌లో వివో టర్నోవర్ (Vivo turnover)రూ.1.25 లక్షల కోట్లలో సగం ఉంటుందని వివరించింది. ఎంత కాలంలో వివో ఈ టర్నోవర్ సాధించిందన్న సంగతి ఈడీ (ED)అధికారులు వెల్లడించలేదు. రూ. వేల కోట్లలో జరిగిన ఈ హవాలా లావాదేవీల్లో పలువురు చైనీయులు, పలు భారత కంపెనీలు భాగస్వాములుగా ఉన్నాయని పేర్కొంది. వివో కంపెనీపై నిఘా పెట్టిన ఈడీ.. ఆ స్మార్ట్ ఫోన్ సంస్థకు చెందిన ముగ్గురు చైనీయులు.. భారత్‌లో 2018-21 మధ్య భారత్‌ను భారత్‌ను వీడారని ఈడీ అధికారులు తెలిపారు. మరో వ్యక్తి భారత్‌లో చార్టర్డ్ అకౌంటెంట్ నితిన్ గార్గ్ (nitin garg)సాయంతో దేశంలో 23 కంపెనీలు స్థాపించాడని పేర్కొన్నారు.
ఈ 23 కంపెనీలు భారీ మొత్తంలో వివో ఇండియాకు నిధులు బదిలీ చేశాయని, మొత్తం వివో స్మార్ట్ ఫోన్ల విక్రయాలు రూ. 1,25,185 కోట్లని తేలినట్లు చెప్పారు. అందులో సగం రూ.62,476 కోట్లు చైనాకు వివో ఇండియా పంపేసిందని వెల్లడించారు.
భారత్‌లో పన్నుల ఎగవేతకు పాల్పడేందుకు సదరు 23 కంపెనీలు భారీ నష్టాల్లో ఉన్నాయని లెక్కలు చూపారని తెలిపారు. ఈ నెల ఐదో తేదీన వివో ఇండియాకు చెందిన 48 ప్రాంతాల్లో తనిఖీలు చేసిన తర్వాత ఈడీ ఈ ప్రకటన చేసింది. ఇక వివోలో పని చేసిన చైనీయుల్లో ఒకరు బిన్ లూ.. వివో మాజీ డైరెక్టర్ అని ఆయన 2018 ఏప్రిల్‌లో భారత్‌ను వీడి వెళ్లారని ఈడీ అధికారులు చెబుతున్నారు. మరో ఇద్దరు జెన్‌షెన్ ఔ, ఝాంగ్ జై గతేడాది దేశాన్ని విడిచి వెళ్లిపోయారని అన్నారు.