New Delhi, July 04: ఇప్పుడంతా టెక్నాలజీ మయం.. తొలుత 2016లో పాత పెద్ద నోట్ల రద్దు.. 2020లో కరోనా మహమ్మారి ఉధృతి తర్వాత డిజిటల్ చెల్లింపులు పెరిగిపోయాయి. వాటితోపాటు సైబర్ మోసాలు పెరుగుతున్నాయి. టెక్నాలజీ సాయంతో ఎప్పటికప్పుడు హ్యాకర్లు వాడే మాల్‌వేర్‌లకు అడ్డుకట్ట వేసేందుకు టూల్స్ తయారు చేస్తూనే ఉన్నారు.. హ్యాకర్లు (Hackers)కూడా తెలివి మీరారు. నిత్యం కంప్యూటర్లలో వాడే సీ, సీప్లస్ వంటి టూల్స్‌తో డిజైన్ చేసిన మాల్‌వేర్‌లు (Malware) వదులుతున్నారు. అటువంటి మాల్‌వేరే రాకూన్ Racoon malware. దీనికి నెటిజన్ల ఫింగర్ ప్రింట్స్ (finger prints) మొదలు పాస్‌వర్డ్‌లన్నీ తస్కరించగలదని సెక్యూరిటీ అనలిస్టులు హెచ్చరిస్తున్నారు. ఇది ఈజీగా పలు హ్యాకింగ్ టూల్స్‌తో కలిసిపోతుందని (కస్టమైజేషన్).. లాప్‌టాప్‌లు(laptops), డెస్క్‌టాప్ కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లలోకి (Mobile Phones) చాలా తేలిగ్గా దూసుకెళ్లగలుగుతుందని సెక్యూరిటీ రీసెర్చర్లు హెచ్చరిస్తున్నారు.
రోజువారీ నెట్‌బ్యాంకింగ్ (Net banking), మొబైల్ బ్యాంకింగ్ (Mobile banking)వాడే నెటిజన్లను లక్ష్యంగా చేసుకున్న హ్యాకర్లు ఈ రాకూన్ మాల్‌వేర్ (Raccoon Malware) అప్‌గ్రేడ్ వర్షన్ గతేడాది విరివిగా వాడారని సిక్యూయా సెక్యూరిటీ అనలిస్టులు నిగ్గు తేల్చారు. రాకూన్ స్టెల్లార్ ఆపరేషన్లు గత మార్చిలో నిలిచిపోయాయి. కానీ, హ్యాకర్లు ఇప్పుడు రాకూన్ స్టెలార్ 2.0 Racoon Stealer 2.0 తీసుకొచ్చారు. దీన్ని సీ, సీప్లస్ ప్లస్ వంటి కంప్యూటర్ లాంగ్వేజ్‌లతో డిజైన్ చేశారని గత నెలలో సెక్యూరిటీ అనలిస్టులు పసిగట్టారు. హ్యాకర్లు నిర్దేశించుకున్న టార్గెట్ కంప్యూటర్ల నుంచి ప్రతి సమాచారాన్ని తస్కరించేస్తుందీ మాల్‌వేర్ (Malware). అన్ని రకాల పాస్‌వర్డ్‌లు, కుకీలు, ఆటోఫిల్ డేటా, క్రెడిట్ కార్డు డేటా తస్కరిస్తుంది. అన్ని డిస్క్‌ల్లో సేవ్ చేసిన విడి విడి ఫైల్స్ కూడా తప్పించుకోలేవని హెచ్చరికలు జారీ చేశారు సెక్యూరిటీ విశ్లేషకులు.
కేవలం బ్యాంకుల్లో ఖాతాదారుల డెబిట్(debit), క్రెడిట్ కార్డుల (Credit cards) డేటా మాత్రమే కాదు.. అత్యంత రహస్యమైనవిగా భావించే క్రిప్టో కరెన్సీ వాలెట్లలోకి చొచ్చుకెళ్లగల సామర్థ్యం రాకూన్ స్టెలార్ 2.0 సొంతం. మెటామాస్క్, ట్రోన్‌లింక్, బినాస్‌చైన్, రానిన్, ఎక్సోడస్, ఆటోమిక్, జాక్స్‌లిబర్టీ, కాయినోమీ, ఎలక్ట్రామ్, ఎలక్ట్రామ్-ఎల్టీసీ, ఎలక్ట్రాన్ క్యాష్ వంటి బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్ల సాయంతో క్రిప్టో వాలెట్స్‌ను తస్కరించేస్తుందిది. దీని నుంచి డేటా కాపాడుకోవాలంటే.. డౌన్‌లోడ్ చేసుకుంటున్న ఫైల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సెక్యూరిటీ అనలిస్టులు చెబుతున్నారు. గుర్తు తెలియని లింక్స్ గానీ, సురక్షితం గానీ సోర్స్ నుంచి వచ్చిన యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవద్దంటున్నారు. ఈ-మెయిల్స్‌తో వచ్చే డౌన్‌లోడింగ్ అటాచ్‌మెంట్ ఫైల్స్ గురించి జాగ్రత్తగా ఉండాలి. యాంటీ వైరస్, యాంటీ మాల్‌వేర్ టూల్స్ సిస్టమ్‌లో తప్పనిసరిగా ఇన్‌స్టాల్ చేసుకోవాలి సుమా. అవసరమైతే ఆటోమేటిక్ స్కాన్ ఆప్షన్ కూడా ఎనేబుల్ చేసుకోవడం సేఫ్.