Chennai, AUG 18: దేశవ్యాప్తంగా ఆగస్టు15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని (Independence day) ఘనంగా నిర్వహించుకుంటారు. కులమతాలకు అతీతంగా ప్రధానోపాధ్యాయులు ప్రభుత్వ స్కూళ్లలో జాతీయ జెండాను ఎగురవేస్తారు. అయితే ఒక ప్రభుత్వ ప్రధానోపాధ్యాయురాలు (Headmistress) మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించింది. తాను క్రిస్టియన్ (Christian) అని, జాతీయ జెండా ఎగురవేయనని, జెండాకు వందనం కూడా చేయనని తేల్చి చెప్పింది. ఈ సంఘటన తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో (Dharmapuri district) చోటు చేసుకుంది. భారత్‌కు స్వతంత్రం సిద్ధించి 75 ఏళ్లైన సందర్భంగా ఈ ఏడాది స్వతంత్ర వజ్రోత్సవాలను దేశ వ్యాప్తంగా ఎంతో ఘనంగా నిర్వహించారు. అయితే ధర్మపురి జిల్లాలోని ప్రభుత్వ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు తమిళసెల్వి (Tamil Selvi ) మాత్రం జాతీయ జెండా ఎగురవేసేందుకు నిరాకరించింది. తాను క్రిస్టియన్ అని, జాతీయ జెండా ఎగురవేయనని స్పష్టం చేసింది. అలాగే జాతీయ జెండాకు వందనం కూడా చేయనని చెప్పింది.
நாங்கள் கிறிஸ்தவர்கள், இந்திய கோடிக்கு வணக்கம் செய்ய மாட்டோம், என்று கூறுகிறார் அரசு பள்ளியின் கிறிஸ்தவ தலைமை ஆசிரியை. pic.twitter.com/t3j9JXOXaJ
— இந்து நாடார் (@ramaiyyah) August 16, 2022
‘మేం దేవుడికి మాత్రమే నమస్కరిస్తాం, మరెవరికీ కాదు. జెండాను గౌరవిస్తాం కానీ దేవుడికి మాత్రమే నమస్కరిస్తాం. కాబట్టి, జెండాను ఎగురవేయమని అసిస్టెంట్ ప్రధానోపాధ్యాయురాలిని కోరాను’ అని తెలిపింది. ప్రధానోపాధ్యాయురాలు తమిళసెల్వి ఈ ఏడాది రిటైర్ కానుంది. దీంతో ఆమెతో జెండా ఎగురవేయించి సత్కరించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు.
అయితే జెండా ఎగురవేయడం నుంచి తప్పించుకునేందుకు తమిళసెల్వి ఆగస్టు15న సిక్ లీవ్ పెట్టింది. ఆమె గత కొన్నేళ్లుగా ఇలాగే చేస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో జిల్లా విద్యాశాఖ ముఖ్య అధికారికి ఆమెపై ఫిర్యాదు చేశారు.